• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • TAMILNADU ELECTION RESULTS AFTER FIRST ROUND OF COUNTING DMK LEADING AND AIADMK TRAILING SSR

Tamilnadu Election Result: తమిళనాడులో ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఎలా ఉందంటే..

స్టాలిన్, పన్నీరుసెల్వం, పళనిస్వామి

ప్రస్తుతం డీఎంకే 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీతో కలిసి పోటీ చేసిన అన్నాడీఎంకే 42 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబర్చింది. ఇక.. సినీ నటుడు కమల్‌హాసన్ తన పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపినప్పటికీ అంత పెద్ద ప్రభావం చూపలేకపోతున్నారు. కమల్‌హాసన్ ఒక్కరే ఆయన పోటీ చేసిన కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • Share this:
    Tamilnadu Election Results: తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే హవా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం డీఎంకే 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీతో కలిసి పోటీ చేసిన అన్నాడీఎంకే 42 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబర్చింది. ఇక.. సినీ నటుడు కమల్‌హాసన్ తన పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపినప్పటికీ అంత పెద్ద ప్రభావం చూపలేకపోతున్నారు. కమల్‌హాసన్ ఒక్కరే ఆయన పోటీ చేసిన కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే.. ఆ ఆధిక్యం కూడా స్వల్పంగానే ఉండటం గమనార్హం. తొలి రౌండ్‌లో కమల్‌హాసన్‌కు 1,391 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 1,345 ఓట్లు పోలయ్యాయి. ఇక డీఎంకే అధినేత స్టాలిన్ సొంత నియోజకవర్గమైన కొళత్తూర్‌లో ఆది నుంచే స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.

    తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి స్టాలిన్ 1,754 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. స్టాలిన్‌కు మొత్తం 3,199 ఓట్లు పోలవగా, అన్నాడీఎంకే అభ్యర్థి రాజారాంకు 1,445 ఓట్లు పోలయ్యాయి. ఇక.. కోవిల్‌పట్టి నుంచి పోటీ చేసిన శశికళ విధేయుడు టీటీవీ దినకరన్ తొలి రౌండ్‌లో వెనుకబడ్డారు. దినకరన్ కంటే ఆయన ప్రత్యర్థి 400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    Election Results 2021 Live Updates కోసం క్లిక్ చేయండి

    బీజేపీ తరపున థౌంజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సినీ నటి కుష్బూ సుందర్ కూడా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ముగిసే సమయానికి వెనుకబడ్డారు. ఇక.. తొలి రౌండ్ ముగిసేసరికి బొడినాయకనూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఓపీఎస్ తన సమీప ప్రత్యర్థిపై 233 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.
    Published by:Sambasiva Reddy
    First published: