Home /News /politics /

TAMILNADU CM STALIN BELONGS TO PRAKASAM DISTRICT ON VILLAGE IN ANDHRA PRADESH NGS

Andhra Pradesh: తమిళనాడు సీఎంకు ఏపీలో పూజలు.. స్టాలిన్ మావాడే అంటూ పొగడ్తలు

ఏపీలో తమిళ సీఎం కు పూజలు

ఏపీలో తమిళ సీఎం కు పూజలు

తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టి కొన్ని రోజులు కూడా అవ్వలేదు. అప్పుడే ఏపీలో ఆయనకు అభిమానులు పుట్టుకొచ్చారు. అది కూడా పూజలు చేసేంత రేంజ్ లో.. ఇంతకీ స్టాలిన్ కు ఏపీలో పూజలు ఎందుకు చేస్తున్నారో తెలుసా?

  ఇది కాస్త చిత్రం అనిపించినా నిజం.. తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఏపీలో పూజలు చేస్తున్నారు. సాధరణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అద్భుతంగా పరిపాలిస్తుంటే.. ఆ రాష్ద్రానికి సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల ప్రజలు ఆ సీఎంకు అభిమానులు అవుతారు. ఆరాధిస్తుంటారు. కానీ స్టాల్ ముఖ్యమంత్రి అయ్యిందే తొలిసారి. ఆయన పాలన ఎలా ఉంటుందో ఇంకా ఎవరికీ తెలియదు.. అయినా ఆయనుకు ఆంధప్రదేశ్ లో అభిమానులు ఉన్నారు. అది పూజలు చేసేంత అభిమానం అంటే ఏంటో అంత్య ప్రత్యేకత అని డౌట్ రావడం కామన్.

  తమిళనాడు ఎన్నికల్లో డీఎంకెని గెలుపు బాటలో నడిపించి.. సీఎం ప్రమాణస్వీకారం చేసిన ఎంకే స్టాలిన్‌ కుటుంబ మూలాలు మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉన్నాయి అంటున్నారు అక్కడి స్థానికులు. ఆయన తండ్రి కరుణానిధి పూర్వీకులు మంచి సంగీత విద్వాంసులు. వీరిది విజయనగరం జిల్లా అయినప్పటికీ అక్కడి నుంచి జీవనోపాధి కోసం ఒంగోలు ప్రాంతానికి వెళ్లినట్టు సమాచారం. పెళ్లూరు సంస్థానాన్ని పాలించిన వెంకటగిరి మహారాజా ఆస్థానంలో వాయిద్య కళాకారులుగా కీర్తి పొందరు. ఒంగోలు శివారు పెళ్లూరు గ్రామంలో ఉన్న శివాలయంలో వీరు స్వామివారి సేవల్లో మంగళవాయిద్యాలను మోగించేవారంట..

  ఇదీ చదవండి: రాష్ట్రానికి ఊపిరి పోసే నిర్ణయం.. భారీగా నిధులు కేటాయించిన ఏపీ సీఎం జగన్

  పెళ్లూరు ప్రాంతం మొత్తం వెంకటగిరి రా జాగారి ఏలుబడిలో ఉండటంతో కరుణానిధి పూర్వీకులు నివసించటానికి దగ్గరలో ని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో నివాసస్థలాలు కేటాయించినట్లు చరిత్ర చెబుతోంది. నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కరుణానిధి పూర్వీకులు మొత్తం ఐదు కుటుంబాల వారు.. అలా ఒంగోలుకు వచ్చి స్థిరపడినట్టు కథనాలు ఉన్నాయి. వీరికి దాదాపు 150 ఎకరాల భూమిని మాన్యంగా కేటాయించినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో వీరు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, దేవస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా చాలాకాలం పనిచేశారు. తరువాత కాలంలో ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు కాటకాలు రావటం, పంటలు సరిగా పండకపోవడంతో వారి జీవనం కష్టమైంది.

  ఇదీ చదవండి: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉగ్రవాద లక్షణాలు... వైసీపీ మంత్రుల కౌంటర్ ఎటాక్

  ఇక బతుకు బారమై కరుణానిధి పూర్వీకులు ఇక్కడి భూములను విక్రయించి, తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి వలస వెళ్లినట్లు గ్రా మంలోని వృద్ధులు చెబుతూ ఉంటారు. డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్‌ పూర్వీకులది తమ ఊరే అంటున్నారు. ఆనాడు వెంకటగిరి రాజా ఇచ్చిన పొలాలు సాగు చేసుకుంటూ, ఆస్థాన విద్వాంసులుగా ఉండేవారని స్వయంగా కరుణానిధి చెప్పటంతో తెలిసిందంటున్నారు. తమ తాతలు మాత్రం ఊరిలోనే ఉండిపోగా, కరుణానిధి తాతలు తంజావూరు వలసవెళ్లారని చెబుతున్నారు.

  ఇదీ చదవండి: కర్ఫ్యూతో కంట్రోల్ కాని కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు.. భయం భయం

  కరుణానిధి సైతం తన తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన నాదస్వరం నేర్చుకుని ఎంతో గొప్పగా వాయించేవారు. అంతేకాకుండా ఆయన గొప్ప రచయిత కూడా అంటున్నారు. 1960లో ఏలూరులో జరిగిన తెలుగు డిటెక్టివ్‌ నవలా రచయితల సంఘం సమావేశానికి చెన్నై నుంచి కరుణానిధి ముఖ్య అతిథిగా హాజరయ్యా రని. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన డిటెక్టివ్‌ నవలా రచయిత జలంధర్‌ బాలకృష్ణ ఆయనను కలిసినప్పుడు, ఆనందంతో తమ ప్రాంతం గురించి అడిగారని నాటి సంఘటనను గుర్తు చేస్తున్నారు. తమ పూర్వీకులది ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెం అని, జీవనోపాధి కోసం తంజావూరు వలస వెళ్లారని ఆయనే స్వయంగా చెప్పినట్టు స్థానికులు చెబుతున్నారు.

  ఇదీ చదవండి: అమ్మగా.. కూతురుగా రోజా డబుల్ రోల్.. చెవిలో పువ్వులు పెట్టుకొని ఫోజులు

  కరుణానిధి జీవించి ఉన్న సమయంలో పలుసార్లు త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా ఇక్కడి నాదస్వర కళాకారులు తంజావురుకు వెళ్లినప్పుడు ఆయనను ప్రత్యేకంగా కలిసేవారన్నారు. అందుకే తమకు స్టాలిన్ పైనా అభిమానమంటున్నారు. కుదిరినప్పుడు స్టాలిన్ ను పిలవడం లేదా..? వెళ్లి కలుస్తామంటున్నారు. స్టాలిన్ కు సైతం.. తన తండ్రిలాగే ముత్తాత ఊరిపై మమకరాం ఉందని చెబుతున్నారు. అందుకే అతడికి ఇలా పూజలు చేస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, MK Stalin, Prakasam, Tamil nadu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు