హోమ్ /వార్తలు /రాజకీయం /

అభినందన్‌కు పరమ్ వీర్ చక్ర ఇవ్వండి... ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం లేఖ

అభినందన్‌కు పరమ్ వీర్ చక్ర ఇవ్వండి... ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం లేఖ

ప్రధాని మోది, అభినందన్

ప్రధాని మోది, అభినందన్

1983 జూన్ 21న భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్థమాన్ కు జన్మించాడు అభినందన్. అతని తల్లి డాక్టర్, తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేశారు.

  భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్... ప్రస్తుతం ఈ పేరుకు పరిచయం కూడా అవసరం లేదు. అభినందన్ పేరు విన్నా చెప్పినా... భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి నరనరాల్లో దేశభక్తి ఉప్పుంగొతుంది. భారతీయుల హృదయాలు ధీరత్వంతో నిండిపోతున్నాయి . అభినందన్ అనే పేరు భారత్ కు ఓ బ్రాండ్‌గా మారిపోయింది. పాకిస్థాన్‌కు చిక్కి కూడా ఏమాత్రం చెక్కు చెదరని ఆత్మ విశ్వాసాన్ని, ధీరత్వాన్ని ప్రదర్శించాడు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. తన ధైర్య సాహసాలతో తిరిగి సొంతగడ్డపై క్షేమంగా కాలు మోపి రియల్ హీరో అనిపించుకున్నారు. అలాంటి అభినందన్‌ వీరత్వం గుర్తించి ఆయనకు భారత అత్యున్నత అవార్డైన పరమ్ వీర చక్ర ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు తమిళనాడు సీఎం పళనిస్వామి.


  అభినందన్ సొంత రాష్ట్రం తమిళనాడు. 1983 జూన్ 21న భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్థమాన్ కు జన్మించాడు. అభినందన్ తల్లి డాక్టర్, తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో యుద్ధ విమానాల పైలట్‌గా పనిచేశాడు. ప్రస్తుతం చెన్నైలో అభినందన్ కుటుంబం నివాసముంటుంది. 2019 ఫిబ్రవరి 27న పాకిస్తానీ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తన మిగ్-21 నడుపుతూ వెంబడించి కూల్చేశాడు. అయితే ఈ వైమానిక పోరాటంలో అభినందన్ నడుపుతున్న మిగ్-21 పాకిస్తానీ భూభాగంలోకి వెళ్ళింది, పాకిస్తానీ వైమానిక దళం వారు దీన్ని కూల్చివేశారు. ఈ ఘటనలో అభినందన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి వెళ్లి పాక్ ఆర్మీకి చిక్కాడు.


   


  అయితే ఇప్పటివరకు భారత ప్రభుత్వం 21మందికి మాత్రమే పరమ్ వీర్ చక్ర అవార్డులను ప్రకటించింది. ఇందులో 20మంది ఇండియన్ ఆర్మీకి చెందిన వారైతే.. ఒకరు మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కు చెందినవారు కావడం విశేషం. భారత్ ఫాక్ యుద్ధ సమయంలో 1971 డిసెంబర్ 14న IAF ఫ్లయింగ్ ఆఫీస్ నిర్మల్ జిత్ జింగ్ సిఖోన్‌‌కు పరమ్ వీర్ చక్ర అవార్డు దక్కింది.


  Chief Minister of Tamil Nadu, Edappadi K. Palaniswami writes to Prime Minister Narendra Modi requesting Param Veer Chakra (country's highest military honour) for Wing Commander Abhinandan Varthaman. (File pic) pic.twitter.com/6HVzrumn7F


  First published:

  Tags: Abhinandan Varthaman, Palanisami, Pm modi, Tamilnadu

  ఉత్తమ కథలు