• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TAMILNADU ASSEMBLY ELECTIONS UPDATE TTV DINAKARAN HINTS ON SASHIKALA POLITICAL FUTURE SSR

Sasikala Update: ఎన్నికల్లో చిన్నమ్మ పోటీ చేస్తారా? అసలు ముచ్చట చెప్పేసిన దినకరన్

Sasikala Update: ఎన్నికల్లో చిన్నమ్మ పోటీ చేస్తారా? అసలు ముచ్చట చెప్పేసిన దినకరన్

శశికళ(ఫైల్ ఫొటో)

తమిళనాడు రాజకీయాల్లో శశికళ రీఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. శశికళ ఈ నెల 8న చెన్నైలో అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో శశికళ పోటీకి సంబంధించి ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కీలక ప్రకటన చేశారు. తమిళనాడు అసెంబ్లీకి త్వరలో జరగబోయే ఎన్నికల్లో...

  • Share this:
    చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో శశికళ రీఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. శశికళ ఈ నెల 8న చెన్నైలో అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో శశికళ పోటీకి సంబంధించి ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కీలక ప్రకటన చేశారు. తమిళనాడు అసెంబ్లీకి త్వరలో జరగబోయే ఎన్నికల్లో వీకే శశికళ పోటీ చేస్తారని దినకరన్ ప్రకటించారు. అంతేకాదు, అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని శశికళే ఎంపిక చేస్తారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా.. శశికళ తమిళనాడు ఎంట్రీ అన్నాడీఎంకేలో కాక పుట్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ వారసత్వం కోసం అన్నాడీఎంకే, శశికళ మధ్య పరోక్షంగా యుద్ధమే నడుస్తోంది. బెంగళూరులో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంలో శశికళ కారుపై అన్నాడీఎంకే పార్టీ జెండాను చూసిన అన్నాడీఎంకే మంత్రులు తమిళనాడులో ఆ సీన్ మళ్లీ కనిపించకూడదని పట్టుదలతో ఉన్నారు.

    శశికళ అన్నాడీఎంకే బహిష్కృత నేత అని, ఆమెకు జెండాను ఉపయోగించే అర్హత లేదని ఆ పార్టీ మంత్రులు, సీనియర్ నాయకులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆమె తమ పార్టీ జెండా ఉపయోగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై దినకరన్ స్పందిస్తూ.. శశికళ అన్నాడీఎంకే జెండాను ఉపయోగించడంపై డీజీపీకి కాదు త్రివిధ దళాలకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించడం కొసమెరుపు. చెన్నైలో శశికళకు స్వాగతం పలికేందుకు ఆమె వర్గీయులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. శశికళ చెన్నై రాక సందర్భంగా హోసూరు నుంచి చెన్నై వరకూ ఆమె అనుచరులు తలపెట్టిన ర్యాలీకి కూడా పోలీసులు అనుమతించినట్టు దినకరన్ తెలిపారు.

    మాజీ సీఎం జయలలిత సమాధి వద్దకు శశికళ వెళ్లి శపథం చేసేందుకు అవకాశాలుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అక్కడి మ్యూజియం పనులను పూర్తి చేయాలనే కారణంగా జయలలిత సమాధి వద్దకు ఈ నెల 23 వరకూ ఎవరికీ ఎంట్రీ లేదని ఇప్పటికే ప్రకటించింది. శశికళ రాజకీయంగా కీలక అడుగులు వేసి అన్నాడీఎంకేలో సంక్షోభం సృష్టించే అవకాశం ఉందన్న సమాచారంతో ఆమె స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు రచించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో అన్నాడీఎంకే ముఖ్య నేతలు సమావేశమయ్యారు. శశికళ చెన్నైకి చేరుకోగానే అన్నాడీఎంకేలోని అసంతృప్త ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి దినకరన్ పార్టీలో చేరుతారంటూ ఊహాగానాలు వినపడుతున్నాయి.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు