హోమ్ /వార్తలు /National రాజకీయం /

Tamilnadu Election Results: తమిళనాడులో వార్ వన్‌సైడేనా.. అక్కడ మాత్రం బీజేపీదే అధికారమట..!

Tamilnadu Election Results: తమిళనాడులో వార్ వన్‌సైడేనా.. అక్కడ మాత్రం బీజేపీదే అధికారమట..!

తమిళనాట ఓటర్ నాడిపై ఎగ్జిట్ పోల్స్ అన్ని ఒకే రకమైన అంచనాను వెల్లడించాయి. రాష్ట్రంలో డీఎంకే కూటమి క్లీన్ స్విప్ చేస్తుందని P-MARQ, REPUBLIC CNX, టూడేస్ చాణక్య, యాక్సిస్-మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 234 స్థానాల్లో డీఎంకే కూటమి మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి 50 వరకు స్థానాలను సొంతం చేసుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

ఇంకా చదవండి ...

  Tamilnadu Election Results: తమిళనాడులో ఏప్రిల్ 6న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు విడుదల కాబోతున్నాయి. వార్ వన్‌సైడేనని.. అధికారం డీఎంకేదేనని పలు ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే అంచనా వేశాయి. తమిళనాడులో ప్రధానంగా మూడు పార్టీలు బరిలో నిలిచాయి. డీఎంకే-కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(దినకరన్ పార్టీ) ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయాయి. నటుడు కమల్‌హాసన్ కూడా మకల్క నీది మయం అభ్యర్థుల తరపున జోరుగానే ప్రచారం చేశారు. తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలు 234. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118. సీఎం పళనిస్వామి పోటీ చేసిన నియోజకవర్గం ఎడప్పాడి. సీఎం పళనిస్వామి ఎడప్పాడిలో నాలుగు సార్లు విజయం సాధించారు. 1989, 1991, 2011, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎడప్పాడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పళనిస్వామిపై డీఎంకే అభ్యర్థి టి.సంపత్ కుమార్ పోటీకి దిగారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం పోటీ చేసిన నియోజకవర్గం బొడినాయకనూర్. పన్నీరుసెల్వంపై పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి తంగ తమిళ్ సెల్వన్. ఇక.. కొళత్తూర్ నుంచి స్టాలిన్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా పోటీ చేయడం విశేషం. చెపాక్-తిరువల్లికేని స్థానం నుంచి ఉదయనిధి స్టాలిన్ పోటీ చేశారు. డీఎంకే తరపున ఎన్నికల ప్రచారంలో కూడా ఉదయనిధి స్టాలిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

  ఇక.. తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే.. తమిళనాట ఓటర్ నాడిపై ఎగ్జిట్ పోల్స్ అన్ని ఒకే రకమైన అంచనాను వెల్లడించాయి. రాష్ట్రంలో DMK కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని P-MARQ, REPUBLIC CNX, టూడేస్ చాణక్య, యాక్సిస్-మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 234 స్థానాల్లో DMK కూటమి మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. AIADMK, BJP కూటమి 50 వరకు స్థానాలను సొంతం చేసుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకాంర కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం MNM ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిందని తెలుస్తోంది. అయితే AIADMK నుంచి బలమైన నాయకత్వం లేకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకతను DMK సమర్థవంతంగా ఒడిసి పట్టుకోవడం.. ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావం చేసినట్టుగా తెలుస్తోంది.

  Election Results 2021 Live Updates కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  తమిళనాట దిగ్గజ నేతలు జయలలిత, కరుణానిధి లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో.. ప్రజలు డీఎంకేకు పట్టం గట్టారని అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ పోల్స్‌ చూసిన డీఎంకే శ్రేణులు ఆనందంలో మునిగిపోయారు. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే వాస్తవ ఫలితాలు ఏమిటనేది ఓట్ల లెక్కింపు అనంతరమే తేలనుంది. తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకేదశలో పోలింగ్ జరిగింది. 71.43 శాతం పోలింగ్ నమోదయింది. గెలుపుపై డీఎంకే కూటమి, అన్నాడీఎంకేక కూటమి ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక 140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు.73.58శాతం పోలింగ్ నమోదయింది. కేరళలో 2.74 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  ఇక.. పుదుచ్చేరిలో కూడా ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. పుదుచ్చేరిలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 30. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 16. పుదుచ్చేరిలో రికార్డు స్థాయిలో 81.64 శాతం పోలింగ్ నమోదయింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పుదుచ్చేరిలో అధికారం కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రిపబ్లిక్ సీఎన్‌ఎక్స్ ఎన్డీఏ 16-20 స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 11-13 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఇక, ఏబీపీ-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్.. ఎన్డీఏ 19-23, యూపీఏ 6-10, ఇతరులు 1-2 స్థానాలు కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది.

  First published:

  Tags: 5 State Elections, AIADMK, Bjp, Chennai, DMK, Tamil Nadu Assembly Elections 2021

  ఉత్తమ కథలు