Home /News /politics /

Tamilnadau : గ్రేట్ సీఎం.. అర్థరాత్రి పూట పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు... !

Tamilnadau : గ్రేట్ సీఎం.. అర్థరాత్రి పూట పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు... !

Tamilnadau : గ్రేట్ సీఎం.. అర్థరాత్రి పూట పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు... !

Tamilnadau : గ్రేట్ సీఎం.. అర్థరాత్రి పూట పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు... !

Tamilnadau : రాష్ట్ర సీఎం అర్థరాత్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహంచారు. స్టేషన్‌లోని కేసుల వివరాలను తెలుసుకుని వాటి పరిష్కారం ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారు.దీంతో ఒక సీఎం నేరుగా పోలీసు స్టేషన్‌కు అది కూడా అర్థరాత్రి పూట వెళ్లడం సంచలనంగా మారింది.

ఇంకా చదవండి ...
    తమిళనాడు(Tamilnadu) సీఎం స్టాలిన్ (stalin) ఎన్నిక తర్వాత ఆ రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఆ రాష్ట్ర నెటిజన్లతో పాటు ప్రజల్లో మంచి క్రేజ్ సంపాందించారు. స్టాలిన్ పరిపాలనలో కొత్త ట్రెండ్(trend) సెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఆయన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నా తాజాగా ఆయన నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంచలనం సృష్టించారు.

    సాధారణంగా అర్థరాత్రి పోలీసు స్టేషన్‌కు(police staion) ఆయా డిపార్ట్‌మెంట్‌ల అధికారులు మరి అవసరమైతే... జిల్లా ఎస్పీలు తనిఖీలు చేస్తారు.. ఇంకా కొన్ని సమయాల్లో అయితే హోంశాఖ మంత్రికి పోలీసు స్టేషన్‌లకు వెళ్లడం కూడా చాలా అరుదుగా ఉంటుంది. అయితే తమిళనాడులో మాత్రం ఏకంగా సీఎం పోలీసు స్టేషన్‌ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

    ఈ నేపథ్యంలోనే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిన్న ఆర్ధరాత్రి(midnight) సమయంలో సేలం నుంచి ధర్మపురికి వెళ్తున్న సమయంలోనే అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు.. దీంతో.. పోలీసులంతా టెన్షన్ పడ్డారు.. .. లోపలికి వెళ్లి పోలీసు స్టేషన్ నిర్మాణానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. పీఎస్‌ను ఎప్పుడు నిర్మించారు.. పోలీసు స్టేషన్‌ను ఎప్పుడు ప్రారంభించారు లాంటి వివరాలను తెలుసుకున్న సీఎం.... పీఎస్‌లో నమోదైన కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.. స్టేషన్‌లో నమోదైన ఆ కేసుల విచారణ ఎక్కడ వరకూ వచ్చాయి అని అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను తనిఖీ చేసి, ఫిర్యాదుదారుల నుండి స్వీకరించిన పిటిషన్లు మరియు తీసుకున్న చర్యల గురించి పోలీసు సిబ్బందిని అడిగారు. ఆ తర్వాత పోలీసు సిబ్బంది బాగోగుల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుని.. ఆ తర్వాత వెళ్లిపోయారు. దీంతో స్టాలిన్ పనితీరుపై సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రంశంసలు అందుకుంటున్నారు.

    కాగా ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం స్టాలిన్ దేశ రాజకీయాలకు ఆదర్శంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను ఆ ఫోటోలను కూడా ప్రస్తుత ముఖ్యమంత్రులు వాటిని కొనసాగించకపోవడం లేదంటే వాటి మీద తమ ఫోటోలను పెట్టి ప్రచారం చేసుకుంటారు. మొత్తం మీద గత ప్రభుత్వాలు తీసుకున్న ఏ పథకాన్నైనా తమ స్వంత పథకంగా ప్రచారం చేసుకుంటారు. ఈ అయితే స్టాలిల్ మాత్రం ఇలా చేయలేదు.. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత ఫోటోలను స్కూల్ బ్యాగులపై అలాగే ఉంచి పంపిణి చేశారు. గతంలో ప్రింట్ చేసిన బ్యాగులపై జయలలిత ఫోటోను తొలగించకుండా చేసి రాష్ట్ర ఖాజనాపై భారం పడకుండా చేశాడు. మరోవైపు అమ్మ క్యాంటిన్లలో కూడా ఇదే విధంగా పాత సీఎం ఫోటోలు మార్చకుండా వాటిని కొనసాగించారు.

    ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలకు గిఫ్టులు ఇచ్చే అలవాటుతోపాటు అసెంబ్లీలో క్యాంటిన్ సేవలను కూడా నిలిపి వేశారు. ఎమ్మెల్యేలు ఇంటినుండే భోజనం తెచ్చుకునే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ముఖ్యమంత్రిని పోగుడుతున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలను సున్నితంగా హెచ్చరించారు. ఇంకోసారి రిపిట్ కావద్దని చెప్పారు. దీని ద్వార అసెంబ్లీలో సమయం వృధా అవడం తప్ప ప్రయోజనం లేదని సున్నితంగా మందలించారు. మరోవైపు ఓ సారి సడెన్‌గా రోడ్డుపై వెళుతూ తన కాన్వాయ్ ఆపి .. రోడ్డుపై ఉన్న సాధారణ వ్యక్తి ఫిర్యాదు తీసుకున్నారు. వీటితో పాటు దేవాలయాల్లో(Temples) దళితులను పూజారులుగా నియమించడం లాంటీ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ దేశంలోనే పలు పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Tamilnadu

    తదుపరి వార్తలు