రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేది అప్పుడే.. అప్పటి వరకు వాటితోనే గడిపేస్తానంటూ..

వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రజనీకాంత్ రాజకీయాల్లో అరంగేట్రం చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ, వారికి నిరాశే ఎదురైంది.అయితే, తాజా ప్రకటనతో తలైవా అభిమానులు సంతోషిస్తున్నారు.

news18-telugu
Updated: May 13, 2019, 7:21 AM IST
రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేది అప్పుడే.. అప్పటి వరకు వాటితోనే గడిపేస్తానంటూ..
ఫైల్ ఫోటో
  • Share this:
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అభిమానులను నిరాశ పరిచినా అసెంబ్లీ ఎన్నికల నాటికి సిద్ధమవుతానని ఆయన ప్రకటించారు. 2021 నాటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని, అప్పటి వరకు సినిమాలతోనే తన జీవితం అని స్పష్టం చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి సిద్ధంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రజనీకాంత్ రాజకీయాల్లో అరంగేట్రం చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ, వారికి నిరాశే ఎదురైంది.అయితే, తాజా ప్రకటనతో తలైవా అభిమానులు సంతోషిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన నయనతారతో కలిసి దర్బార్ సినిమా చేస్తున్నారు. ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా 2020 సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంతవరకు తన పార్టీకి పేరు కూడా ప్రకటించని రజనీ, ఆ సినిమా త్వరాతైనా పార్టీ పేరు ప్రకటిస్తారని ఆశిస్తున్నారు.

First published: May 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు