నాకు ఓటేస్తే పది లీటర్ల లిక్కర్ ఫ్రీ... నవ వధువులకు పది లక్షలిస్తా... ఇంకా...

నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు... మహిళలకు కావల్సినంత బంగారం... నవవధువులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, నియోజికవర్గంలో ఉన్న మహిళలందరికీ ఆర్థిక భరోసాగా రూ.25000...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 29, 2019, 6:46 PM IST
నాకు ఓటేస్తే పది లీటర్ల లిక్కర్ ఫ్రీ... నవ వధువులకు పది లక్షలిస్తా... ఇంకా...
నాకు ఓటేస్తే పది లీటర్ల లిక్కర్ ఫ్రీగా ఇస్తా... (నమూనా చిత్రం)
  • Share this:
ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఓటర్లను ఆకర్షించేందుకు ఎప్పుడూ ఒళ్లు వంచని నాయకులు కూడా... ఓట్ల కోసం రోడ్లు ఊడుస్తూ, చెత్త ఎత్తుతూ పడరాని పాట్లు పడతారు. నన్ను గానీ గెలిపిస్తే... అంటూ వాళ్లు ఇచ్చే ఎన్నికల వాగ్దానాల గురించైతే ఎంత చెప్పుకున్నా తక్కువే. నాకు గానీ ఓటు వేస్తే... కొండ మీది కోతినైనా తీసుకువస్తామంటూ వాగ్దానాల వర్షం కురిపిస్తారు అభ్యర్థులు. తాజాగా ఓ అభ్యర్థి... అలాంటి వాగ్దానాల వర్షం కురిపించి, వార్తల్లో నిలిచాడు. లోక్‌సభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈసారి రికార్డు స్థాయిలో దాదాపు 90 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దేశవ్యాప్తంగా ఎంపీ అభ్యర్థులు ప్రచారంలో యమా బిజీగా గడుపుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్ నియోజికవర్గం నుంచి ఎంపీగా పోటి చేసేందుకు నామినేషన్ వేశాడు షేక్ దావుద్ అనే స్వతంత్య్ర అభ్యర్థి.

తాజాగా తన నియోజికవర్గంలో ప్రచారం కూడా నిర్వహించాడు. అయితే మనోడు చేసిన ఎన్నికల వాగ్దానాలు వింటే మాత్రం ఔరా... అనిపించడం ఖాయం. నియోజికవర్గంలో ఉన్న నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన షేక్ దావుద్... మహిళలకు కావల్సినంత బంగారం అందుబాటు ధరలో ఉండేలా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. అంతేనా... నియోజికవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరుకీ పది లీటర్ల స్వచ్ఛమైన బ్రాండీని ఫ్రీగా ఇస్తానని భరోసా ఇచ్చాడు. మనోడి వాగ్దానాల వర్షం అక్కడితో కూడా ఆగలేదు. ఇంకాస్త ముందుకెళ్లి, తనను గెలిపిస్తే పెళ్లి చేసుకునే నవవధువులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, నియోజికవర్గంలో ఉన్న మహిళలందరికీ ఆర్థిక భరోసాగా రూ.25000 ఇస్తానని చెప్పాడు. ఆశ్చర్యకరంగా సదరు షేక్ దావుద్‌కు 15 మంది నామినీలుగా లోక్‌సభ ఎన్నికలకు రికమెండ్ చేయడం విశేషం.First published: March 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>