TAMIL NADU CM STALIN ANNOUNCES 4000 COVID RELIEF AND FREE PUBLIC TRANSPORT FOR WOMAN SK
ప్రతి ఇంటికీ రూ.4వేల కరోనా సాయం.. తొలిరోజే సీఎం వరాలు.. మహిళలకు మరో శుభవార్త
ఎంకే స్టాలిన్
Tamil nadu: రేషన్ కార్డున్న ప్రతి ఇంటికీ రూ.4వేల కరోనా సాయం ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 2.5 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. తొలి విడత కింద రూ.2వేలను ఈ నెలలోనే అందజేస్తారు.
తమిళనాడు ప్రజలపై కొత్త సీఎం ఎంకే స్టాలిన్ వరాల జల్లు కురిపించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కీలక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. రేషన్ కార్డున్న ప్రతి ఇంటికీ రూ.4వేల కరోనా సాయం ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 2.5 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. తొలి విడత కింద రూ.2వేలను ఈ నెలలోనే అందజేస్తారు. మే నెలాఖరు నాటికి అందరికీ కరోనా సాయం అందనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మహిళలకు సీఎం స్టాలిన్ శుభవార్త చెప్పారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇక పాల ధరలను కూడా తగ్గించారు. లీటర్ పాలపై 3 రూపాయల మేర తగ్గిస్తునట్లు వెల్లడించారు.
Tamil Nadu Chief Minister MK Stalin has signed an order to provide Rs 4000 to each family as Corona relief.
First installment of Rs 2000 will be provided in the month of May.
తమిళనాడు ప్రభుత్వ బీమా కార్డుదారులకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు స్టాలిన్. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా సంబంధిత చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. త్వరలోనే మరిన్ని కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని హామీలను అమలు చేస్తామని డీఎంకే నేతలు చెబుతున్నారు.
తమిళనాడు సీఎంగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని రాజ్‌భవన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆయన చేత ప్రమాణం చేయించారు. కరోనా నేపథ్యంలో నిరాడంబకరంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హాజరయ్యారు. స్టాలిన్‌తో పాటు మొత్తం 34 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. తన తండ్రి కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసిన వారిలో చాలా మందికి మళ్లీ కేబినెట్లో అవకాశం దక్కింది. అంతేకాదు 15 మంది ఎమ్మెల్యేలు తొలిసారి మంత్రి పదవులు దక్కించుకున్నారు.
కీలకమైన హోంశాఖతో పాటు పలు ఇతర శాఖలను సీఎం స్టాలిన్ తన వద్దే ఉంచుకున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. కాగా, తమిళనాడులో పదేళ్ల తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చింది. 234 సీట్లున్న తమిళనాడులో డీఎంకే కూటమి 159 సీట్లు సాధించింది. ఇందులో ఒక్క డీఎంకేకే 133 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 18 సీట్లకు పరిమితమయింది. ఇక అన్నాడీఎంకే 66 సీట్లతో సరిపెట్టుకుంది. అన్నాడీఎంకే మిత్రపక్షాలైన బీజేపీ 4, పీఎంకే 5 చోట్ల గెలుపొందాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.