సీఎం మీటింగ్‌ నుంచి జనం పరుగోపరుగు...పారిపోకుండా పట్టుకుంటున్న పార్టీ నేతలు...

(Image : Twitter)

తమిళనాడు సీఎం పళనిస్వామి ఏర్పాటు చేసిన ఎన్నికల సభకు అతి కష్టం మీద జనాన్ని తరలించినా, వారంతా సీఎం సభ ప్రారంభమైన కాసేపటికే అక్కడి నుంచి జారుకోవడం మొదలు పెట్టారు. దీంతో ర్యాలీ మొత్తం జనం లేక బోసిపోవడం కనిపిస్తోంది. ఏం చేయాలో పాలుపోక ఏఐడీఎంకే కార్యకర్తలు ఏకంగా మానవహారం కట్టి మరీ జనం పారిపోకుండా అడ్డుకోవడం వింతల్లో వింతగా నిలిచింది.

  • Share this:
    రాజకీయ నేతల ఎన్నికల ప్రచార సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చే ఎప్పుడో పోయాయి. జనానికి డబ్బు, భోజన ఏర్పాట్లు, వాహనాలు ఏర్పాటు చేసి మరీ సభలకు తరలిస్తున్న సీన్లు, తరచూ కంటబడుతూనే ఉన్నాయి. అయితే ఏమిచ్చినా సరే...సభలో నిలబడటం మావల్ల కాదంటూ జనం పారిపోతున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అయితే ఇలా జనం పారిపోతోంది...అల్లాటప్పా రాజకీయ నేత సభ కాదు...సాక్షాత్తూ తమిళనాడు సీఎం పళనిస్వామి ఏర్పాటు చేసిన ఎన్నికల సభకు అతి కష్టం మీద జనాన్ని తరలించినా, వారంతా సీఎం సభ ప్రారంభమైన కాసేపటికే అక్కడి నుంచి జారుకోవడం మొదలు పెట్టారు. దీంతో ర్యాలీ మొత్తం జనం లేక బోసిపోవడం కనిపిస్తోంది. ఏం చేయాలో పాలుపోక ఏఐడీఎంకే కార్యకర్తలు ఏకంగా మానవహారం కట్టి మరీ జనం పారిపోకుండా అడ్డుకోవడం వింతల్లో వింతగా నిలిచింది.

    జనం సీఎం మాటలు పట్టించుకోకుండా ఇలా ఎవరి దారి వారు వెళ్లిపోయిన ఘటన మన్మదురై ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతం దక్షిణ తమిళనాడులోని శివగంగ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అయితే ఈ సీటు ఏఐఏడీఎంకే-బీజేపీ పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించింది. మిత్రపక్షం అభ్యర్థి కోసం సాక్షాత్తూ సీఎం పళనిస్వామి ప్రచారంలో పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాన్ని సమీకరించి సభకు తెచ్చినప్పటికీ జనం మాత్రం ఆసక్తి చూపకుండా ఎవరి దారి వారు చూసుకోవడం విడ్డూరంగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

    First published: