Home /News /politics /

TAMIL NADU BJP LEADER RAGHAVAN RESIGNS AFTER STING VIDEO SHOWS HIM ON INAPPROPRIATE CALL WITH WOMAN SK

KT Raghavan: మహిళతో అర్ధనగ్నంగా వీడియో కాల్.. వివాదంలో బీజేపీ నేత.. సోషల్ మీడియాలో వైరల్

 కేటీ రాఘవన్ (Youtube/MadansDiary)

కేటీ రాఘవన్ (Youtube/MadansDiary)

Tamilnadu: తమిళనాడు బీజేపీ (BJP) నేత కేటీ రాఘవన్ (KT Raghavan) వీడియోపై దుమారం రేగుతోంది. పార్టీ మహిళా నేతలతో వీడియో కాల్స్‌లో అశ్లీలంగా చాట్ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆ వీడియో వైరల్ కావడంతో ప్రధాన కార్యదర్శి పదవికి ఆయన రాజీనామా చేశారు.

ఇంకా చదవండి ...
    ఆయన బాధ్యత కలిగిన రాజకీయ నేత. నలుగురికీ ఆదర్శంగా ఉండాలి. కానీ మహిళా నేతలతో అశ్లీలంగా మాట్లాడుతూ అడ్డంగా బుక్కయ్యారు. ఓ మహిళతో అర్ధనగ్నంగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమిళనాడు (Tamilnadu)కు చెందిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ (KT Raghavan) వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ జిల్లా నాయకురాలితో అశ్లీలంగా మాట్లాడుతున్న వీడియో కాల్‌ యూట్యూబ్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవికి రాఘవన్ రాజీనామా చేశారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు కుట్రచేశారని.. దీనీని చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ఆయన అన్నారు. చివరకు ధర్మమే గెలుస్తుందని తెలిపారు.

    Narayan Rane: అసలు కేంద్రమంత్రిని అరెస్టు చేయవచ్చా? ఇందుకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయి?

    మదన్ రవిచంద్రన్ (Madan Ravichandran) అనే బీజేపీ కార్యకర్త.. మదన్స్ డైరీ (Madan's Diary) పేరిట యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారు. తన ఛానెల్‌లో రాఘవన్ వీడియోను విడుదల చేశారు. జిల్లా మహిళా నేతతో రాఘవన్ అర్ధనగ్నంగా మాట్లాడుతున్న వీడియో కాల్‌ రికార్డింగ్‌ని జనం ముందు ఉంచారు. రాఘవన్ పైకి కనిపించేంత మంచి వాడని కాదని.. గతంలోనూ ఎంతో మంది మహిళా నేతల జీవితాలతో ఆడుకున్నాడని మదన్  రవిచంద్రన్ ఆరోపించారు. పలువురు మహిళా నేతలతో ఆయన అసభ్య చేష్టలను రికార్డు చేశానని.. బీజేపీకి చెందిన 15 మంది నేతలకు సంబంధించిన ఇలాంటి అసభ్యకర వీడియోలు, ఆధారాలు తన వద్ద ఉన్నాయని మదన్ పేర్కొన్నారు. అతడి వికృత చేష్టల వల్ల బాధితులైన ఎందరో గృహిణులు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి మొత్తం 60 వీడియోలు విడుదల చేస్తానని బాంబు పేల్చారు మదన్. ఇప్పుడీ వ్యవహారం తమిళనాట దుమారం రేపుతోంది.

    అఫ్గానిస్తాన్‌లో భారత్‌ ఆస్తుల విధ్వంసానికి ఐఎస్‌ఐ కుట్ర.. కొత్త ఉగ్రవాద సంస్థ ఏర్పాటు

    తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై (Annamalai) అనుమతితోనే రాఘవన్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసినట్లు మదన్ రవిచంద్రన్ తెలిపారు. ఎంతో మంది మహిళా నేతలు, కార్యకర్తలతో రాఘవన్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని.. ఈ విషయం గురించి పార్టీ అధ్యక్షుడికి తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అందుకే బాధిత మహిళలకు న్యాయం జరగాలన్న ఉద్దేశ్యంతోనే వీడియోను యూట్యూట్‌లో విడుదల చేసినట్లు మదన్ వెల్లడించారు. కేవలం వీడియో ఆధారంగా చర్యలు తీసుకోలేమని పార్టీ అధ్యక్షుడు అన్నామలై చెప్పినట్లుగా ఆయన తెలిపారు.


    ఇందులో నుంచి రాఘవన్ బయటపడతారని, తనపై ఉన్న మచ్చను చెరుపుకుంటారన్న నమ్మకం ఉందని అన్నామలై పేర్కొన్నారు. దీనిపై విచారించేందుకు విచారణ బృందాన్ని నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వ్యవహారంపై రాఘవన్ కూడా స్పందించారు. తనను, పార్టీని అప్రతిష్ట పాలుజేసేందుకే సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోను విడుదల చేశారని ఫేస్‌బుక్‌లో పోస్టులో ఆరోపించారు. తాను ఎలాంటి వాడినో ప్రజలందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. పార్టీ అధ్యక్షుడు అన్నామలైని కలిశానని.. ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.

    Narayan Rane: కేంద్రమంత్రి నారాయణ్ రాణెకు బెయిల్.. నెక్ట్స్ ఏం చేయబోతున్నారు?

    కాగా, మదన్ రవించంద్రన్ యూట్యూబ్‌లో మదన్ డైరీ ఛానెల్ నడుపుతున్నారు. రాజకీయ చర్చా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటారు. ఆ ఛానెల్‌కు 1.41 లక్షలు సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక కేటీ రాఘవన్ చాలా ఏళ్లుగా బీజేపీ అధికార ప్రతినిధిగా టీవీ టిబేట్లో పాల్గొంటున్నారు. అంతేకాదు పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. అంతేకాదు కాంచీపురం బీజేపీ కార్యాలయ నిర్మాణ బాధ్యతలను కూడా ఆయనే చూశారు. కేటీ రాఘవన్ వ్యవహారంపై తమిళనాడులోని డీఎంకే, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అలాంటి నేతను ఇంకా పార్టీలో కొనసాగిస్తారా.. వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Tamil nadu, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు