5 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్‌గా , బీజేపీ తమిళనాడు ప్రెసిడెంట్ తమిళిసై సౌందర్ రాజన్‌ను నియమించారు. వీటితో పాటు... మాజీ కేంద్రమంత్రి , తెలంగాణ బీజేపీ నేత బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సౌందర్ రాజన్ వృత్తిరిత్యా డాక్టర్. తమిళనాడు కన్యకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో జన్మనించారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా ఆమె ఉన్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో సౌందర్ రాజన్ ఎంబీబీఎస్ చదివారు. ఆ సమయంలో విద్యార్థి సంఘం నేతగా కూడా పనిచేశారు. ఇప్పటివరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లుగా ఎంపీగా పోటీ చేసిన ఒక్కసారిగా గెలుపు దక్కలేదు.
కేరళ గవర్నర్‌గా మహ్మద్ ఖాన్, మహారాష్ట్ర గవర్నర్‌గా భగత్ సింగ్ కోశ్యారి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న కల్రాజ్ మిశ్రాను రాజస్థాన్‌కు బదిలీ చేశారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయను నియమించారు.
Published by:Sulthana Begum Shaik
First published:September 01, 2019, 11:26 IST