దొంగ ఓటు వివాదంతో చిక్కుల్లో పడ్డ రెమో సినిమా హీరో...

ఓటరు లిస్టులో పేరు లేకుండా ఓటు ఎలా వేశారు అని స్థానిక మీడియా నిలదీయగా, తాను ప్రత్యేక అనుమతితో వచ్చానన్నారు. అంతే కాదు సెల్ఫీ దిగి వేలిపై సిరాచుక్కను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

news18-telugu
Updated: April 23, 2019, 9:07 PM IST
దొంగ ఓటు వివాదంతో చిక్కుల్లో పడ్డ రెమో సినిమా హీరో...
ఓటరు లిస్టులో పేరు లేకుండా ఓటు ఎలా వేశారు అని స్థానిక మీడియా నిలదీయగా, తాను ప్రత్యేక అనుమతితో వచ్చానన్నారు. అంతే కాదు సెల్ఫీ దిగి వేలిపై సిరాచుక్కను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
news18-telugu
Updated: April 23, 2019, 9:07 PM IST
సెలబ్రిటీలు ఓటింగ్ కు వస్తున్నారంటే మీడియాలో హడావిడి, సోషల్ మీడియాలో పోస్టింగ్ లు తప్పనిసరి. అయితే ఓటర్ లిస్టులో పేరులేకుంటే మాత్రం హెడ్ లైన్స్ లో నిలుస్తుంటారు. అయితే సరిగ్గా ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళ సినిమాల్లో నటించిన ప్రముఖ హీరో శివకార్తికేయన్ ఈ నెల 18న జరిగిన రెండో దశ ఎన్నికల్లో చెన్నైలోని స్థానిక వలసారపక్కం పోలింగ్ బూతులో ఓటు వేయడానికి సతీ సమేతంగా వెళ్లారు. అయితే ఓటర్ లిస్టులో తన పేరు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందు హడావిడి కూడా చేశారు. అయితే శివకార్తికేయన్ భార్య మాత్రమే ఓటు వేసి అక్కడి నుంచి ఇద్దరూ వెళ్లిపోయారు. ఇంతలో ఏమైందో తెలియలేదు..కానీ శివకార్తికేయన్ తిరిగి మళ్లీ బూతులోకి ప్రవేశించి ఓటు వేశారు. అయితే ఓటరు లిస్టులో పేరు లేకుండా ఓటు ఎలా వేశారు అని స్థానిక మీడియా నిలదీయగా, తాను ప్రత్యేక అనుమతితో వచ్చానన్నారు. అంతే కాదు సెల్ఫీ దిగి వేలిపై సిరాచుక్కను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

అయితే జరిగిన పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లగా దీనిపై విచారణకు ఆదేశించింది. అంతే కాదు ఎన్నికల అధికారులకు నోటీసులు సైతం జారీ చేయడంతో ఇప్పుడు వివాదం రాజుకుంది. ఇంతకీ శివకార్తికేయన్ లిస్టులో పేరు లేకుండా ఓటు ఎలా వేశారని, దంగఓటు ఏమైనా వేశారా అనే అనుమానాలకు తావిస్తోంది.

ఇది కూడా చూడండి :-First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...