అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి మద్దతు...తమిళ నటుడు కీలక నిర్ణయం

Tamilnadu Lok Sabha Election 2019 | తమిళనాడులో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో నిలవాలన్న నిర్ణయాన్ని సమత్తువ మక్కల్ కట్చి చీఫ్, సినీ నటుడు శరత్ కుమార్ మార్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. వారి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు.

news18-telugu
Updated: March 29, 2019, 5:30 PM IST
అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి మద్దతు...తమిళ నటుడు కీలక నిర్ణయం
శరత్ కుమార్(ఫైల్ ఫోటో)
  • Share this:
లోక్‌సభ ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో నిలవనున్నట్లు గతంలో ప్రకటించిన ‘సమత్తువ మక్కల్ కట్చి’ అధినేత, ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ తన మనసు మార్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి ఆయన మద్దతు ప్రకటించారు. ఆ కూటమికి మద్దతుగా తాను ప్రచారం చేయనున్నట్ల తెలిపారు. తమిళనాడు సీఎం ఈ.పళనిస్వామితో భేటీ అనంతరం ఈ మేరకు ఆయన మీడియాకు వెల్లడించారు.

అన్నాడీఎంకే అగ్రనేతల కోరిక మేరకు...తమ పార్టీలో అంతర్గతంగా చర్చించి అన్నాడీఎంకే కూటమికి మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే, బీజేపీ, డీఎండీకే తదితర పార్టీలకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. కేంద్రంలో హంగ్ ప్రభుత్వం రాకూడదన్న ఉద్దేశంతో అన్నాడీఎంకే- బీజేపీ కూటమికి మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మైనార్టీల సంక్షేమం, సమైక్యత విషయంలో ఎట్టిపరిస్థితిలోనూ రాజీ పడొద్దన్న అన్నాడీఎంకే నేతలకు సూచించినట్లు శరత్ కుమార్ తెలిపారు.

డీఎంకే, కాంగ్రెస్, ఎండీఎంకే, మరికొన్ని చిన్నా చితక  పార్టీలు మరో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

First published: March 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు