Article 370: ఆర్టికల్ 370 రద్దు పై కమల్ హాసన్ ఘాటు వ్యాఖ్యలు..

దేశంలో ఏ రాష్ట్రానికి లేనట్టు జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై కమల్ హాసన్ కేంద్రం తీరును దుయ్య బట్టారు.

news18-telugu
Updated: August 6, 2019, 5:34 PM IST
Article 370: ఆర్టికల్ 370 రద్దు పై కమల్ హాసన్ ఘాటు వ్యాఖ్యలు..
కమల్ హాసన్ (File Image)
news18-telugu
Updated: August 6, 2019, 5:34 PM IST
దేశంలో ఏ రాష్ట్రానికి లేనట్టు జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్టికల్ రద్దు పై కాంగ్రెస్,పీడీపీ, ఎస్పీడీఎంకే మినహా మిగిలిన పార్టీలు కేంద్రానికి మద్దతు ప్రకటించాయి. అంతేకాదు దేశంలో ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న చారిత్రక తప్పిదాన్ని సరిచేసారని మోడీ, అమిత్ షా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు. కానీ కొంత మంది మాత్రం కాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అందులో ప్రముఖ తమిళ నటుడు కమ్ మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఇది కశ్మర్ ప్రజలపై కేంద్రం తీసుకున్న నిరంకుశ చర్య అని అభివర్ణించారు. అంతేకాదు ఈ నిర్ణయం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అభివర్ణించారు. కనీసం ప్రతిపక్షల నుంచి అభిప్రాయాలు తీసుకోకుకండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్రం వ్యవహరించిన తీరు వలన ప్రజాస్వామ్యం తిరోగమన దిశగా పయనిస్తుందని కమల్ హాసన్ కేంద్రం తీరును తప్పుపట్టారు. 

కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు ఎందుకు ?, why modi govt revoke article 370 in kashmir
నమూనా చిత్రం


కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ‘ఇండియన్’ అదే భారతీయుడు’ఈ సినిమాను చేసిన కమల్ హాసన్ నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు వినడం చాలా విడ్డూరంగా ఉందంటున్నారు. ఆయన చేస్తున్న ’ఇండియన్ 2 అదే  ‘‘భారతీయుడు 2’) సినిమా నుంచి పక్కకు తప్పుకోమని మెజారిటీ నెటిజన్స్ కోరుతున్నారు. ఏమైనా కమల్ హాసన్ ఆర్టికల్ 370 సాక్షిగా మరోసారి వార్తల్లో నిలిచారు.

 

First published: August 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...