అంతా అసత్యప్రచారం... ఆ వీడియోపై తలసాని కుమారుడు క్లారిటీ

తలసాని సాయికిరణ్ యాదవ్

Talasani Sai kiran Yadav | తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి కొంతమంది కావాలనే ఈ రకమైన కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. తాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలను ఎడిట్ చేసి కొందరు కావాలనే ట్రోల్స్ చేశారని తలసాని సాయికిరణ్ యాదవ్ ఆరోపించారు.

 • Share this:
  గోదావరి నది ఆంధ్రా నుంచి తెలంగాణకు వస్తుందని తాను చెప్పినట్టుగా సర్క్యూలేట్ అవుతున్న వీడియోపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు, టీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్ యాదవ్ స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి కొంతమంది కావాలనే ఈ రకమైన కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. తాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలను ఎడిట్ చేసి కొందరు కావాలనే ట్రోల్స్ చేశారని తలసాని సాయికిరణ్ యాదవ్ ఆరోపించారు. ఇలాంటి విషయాలను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.  తాను చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చానని... రాజకీయాల్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి విషయాలను ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసికట్టుగా ఈ రకమైన చర్యలకు పాల్పడ్డారని సాయికిరణ్ యాదవ్ అన్నారు.  తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అభినందించలేని నేతలు... టీఆర్ఎస్ నాయకులపై ఈ రకమైన ట్రోలింగ్స్ చేస్తున్నారని సాయికిరణ్ యాదవ్ ఆరోపించారు. అయినా తెలంగాణ ప్రజలు ఇలాంటి అంశాలను పట్టించుకునే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు.
  Published by:Kishore Akkaladevi
  First published: