అది తప్పుడు ప్రచారం.. నాకు మద్యం అలవాటు లేదు : తలసాని శ్రీనివాస్

Video : టీవీ ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు : మంత్రి తలసాని

తనకు మద్యం అలావాటు లేదని.. ఆడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తలసాని మండిపడ్డారు. ప్రతీ ఏటా బోనాలకు తాను డ్యాన్స్ చేస్తానని.. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చేశానని తెలిపారు.

  • Share this:
    ఇటీవల బోనాల వేడుక సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో తలసాని హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అయితే ఆ సమయంలో తలసాని మద్యం మత్తులో ఉన్నారని.. అందుకే అంత ఉత్సాహంగా డ్యాన్స్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 'మందు బాబులం మేం మందుబాబులం' పాటతో ఆ వీడియో వైరల్ అయింది. తాజాగా దీనిపై స్పందించిన తలసాని.. ఆ ప్రచారాన్ని ఖండించారు. తనకు మద్యం అలావాటు లేదని.. ఆడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ ఏటా బోనాలకు తాను డ్యాన్స్ చేస్తానని.. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చేశానని తెలిపారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు.
    First published: