తాజ్‌మహల్ ముస్లింలు కట్టలేదు.. అదో శివాలయం : కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Union Minister Anant Kumar Hegde on Tajmahal : చరిత్ర రాసేవాళ్లు ఛరిష్మా ఉన్నవాళ్లని, చరిత్ర చదువుకునేవాళ్లు పిరికివాళ్లు అని అనంత్ కుమార్ అన్నారు. చరిత్ర రాసేవాళ్లుగా ఉందామో.. చరిత్ర చదువుకునేవాళ్లుగా ఉందామో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.

news18-telugu
Updated: January 27, 2019, 8:03 PM IST
తాజ్‌మహల్ ముస్లింలు కట్టలేదు.. అదో శివాలయం : కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
తాజ్‌మహల్‌పై కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్దే సంచలన వ్యాఖ్యలు..
  • Share this:
అందాల కట్టడం తాజ్‌మహల్‌పై కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్దే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్‌మహల్ ముస్లింలు నిర్మించింది కాదని.. చరిత్రే ఇందుకు సాక్ష్యం అని అన్నారు. అనంత్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ లౌకికవాదం, శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశం సహా పలు అంశాలపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తాజ్‌మహల్ ముస్లింలు నిర్మించింది కాదు. ఈ విషయాన్ని షాజహాన్ తన ఆత్మకథలో స్వయంగా వెల్లడించాడు. జయసింహ అనే రాజు నుంచి దాన్ని తాను కొనుగోలు చేసినట్టు అందులో చెప్పాడు. ఇప్పుడున్న తాజ్‌మహల్ నిజానికి ఓ శివాలయం. పరమతీర్థ దాన్ని నిర్మించారు.
అనంత్ కుమార్ హెగ్దే, కేంద్రమంత్రి


తాజ్‌మహల్ అసలు పేరు నిజానికి తేజో మహాలయా అని అనంత్ కుమార్ అన్నారు. తర్వాతి కాలంలో తేజో మహాలయా కాస్త తాజ్‌మహల్‌గా మారిందన్నారు. అంతేకాదు, మనం ఇలాగే నిద్రపోతూ ఉంటే ఆఖరికి మన ఇళ్లను కూడా మసీదులుగా మార్చేస్తారని వ్యాఖ్యానించారు. ఇలాగే పోతే భవిష్యత్తులో రాముడిని జహాపనా అని, సీతను బీబీ అని పిలిచే రోజు వస్తుందన్నారు. చరిత్ర రాసేవాళ్లు ఛరిష్మా ఉన్నవాళ్లని, చరిత్ర చదువుకునేవాళ్లు పిరికివాళ్లు అని అనంత్ కుమార్ అన్నారు. చరిత్ర రాసేవాళ్లుగా ఉందామో.. చరిత్ర చదువుకునేవాళ్లుగా ఉందామో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.
First published: January 27, 2019, 8:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading