వైఎస్-నారా కుటుంబాల మధ్య రాజకీయ వైరం నేటిది కాదు.. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి నేటి సీఎం జగన్ వరకు వారితో మాజీ సీఎం చంద్రబాబుకు విబేధాలు ఉన్నాయి. అయితే అవి ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు కూడా వెళ్తున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ - మాజీ సీఎం చంద్రబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత దూరం ఉంది. ఇలాంటి సమయంలో ఓ టీడీపీ నేత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఓ వైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే తాను మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యాను అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు చంద్రబాబును సీఎం చేయానికి ఎవరితోనైనా పోరాడుతాను అంటూ అందర్నీ కన్ఫ్యూజ్ చేశారు. ఈ వ్యాఖ్యలు చేసింది వివాదాస్పద నేతగా ముద్ర ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం జగన్ తో రాజకీయంగా పోరాటం చేస్తున్నారు.. అయినా రాజశేఖర్ రెడ్డిపై ఇలాంటి కామెంట్స్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి వలన తాను మున్సిపల్ చైర్మన్ అయ్యానని, అలాగే చంద్రబాబు కారణంగా ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. తాడిపత్రికి దేశంలోనే స్వచ్ఛమైన మునిసిపాలిటీగా తీర్చిదిద్దానని చెప్పారు జేసీ. తనపై నమ్మకం ఉంచిన టీడీపీ బలోపేతనానికి తాను కృషి చేస్తాను అన్ారు. త్వరలో పదివేలమందితో తాడిపత్రిలో సభ పెడతానని వివరించారు. టీడీపీ అంటే తనకు చాలా అభిమానమని.. ఒకవేళ తనను చంద్రబాబు సస్పెండ్ చేసినా.. నేను ఆ పార్టీ నుంచి వెళ్లనని, పార్టీకోసం పనిచేస్తాను అన్నారు. కొందరు పార్టీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తనకు ఎ్డమ్మెల్యే పింఛన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ప్రభుత్వంపై ప్రజలే తిరగబడతారు.. జగన్ సర్కార్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
గత 9 నెలలుగా తన పింఛన్ డబ్బు జమ కావడం లేదని వివరించారు. ఎవరైనా ఆరోగ్యం బాలేదని తన వద్దకు వస్తే ఆ పింఛన్ డబ్బులు వారికి ఇస్తానని, పింఛన్ డబ్బు రాకపోవడంతో సాయం చెయ్యలేక పోతున్నానని తెలిపారు. టీడీపీని బలోపేతం చేయడానికి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ఎవరినైనా ఎదిరిస్తానని ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇదే సమయంలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. మెసెజ్ చేసిన పాపానికి టీడీపీ కార్యకర్తను జైల్లో పెట్టారని, ఇది అత్యంత దారుణమన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, JC Diwakar Reddy, TDP, YSR