Home /News /politics /

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కనిపించడం లేదు... పీఎస్‌లో ఫిర్యాదు

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కనిపించడం లేదు... పీఎస్‌లో ఫిర్యాదు

ఎమ్మెల్యే శ్రీదేవి (File)

ఎమ్మెల్యే శ్రీదేవి (File)

ఉండవల్లి శ్రీదేవి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.

  వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించడం లేదని తుళ్లూరు పోలీస్స్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు మహిళలు. తమ ఎమ్మెల్యే గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని పోలీసులకు తెలిపారు. ఎమ్మెల్యేను వెతికి పెట్టాలని పోలీసులకు మహిళలు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లి శ్రీదేవి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో తమ సమస్యల్ని చెప్పుకుందామంటే.... తమ ఎమ్మెల్యే పత్తా లేకుండా పోయారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా ఏపీ రాజధాని మార్పుపై అమరావతి గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించి రైతులు నిరసనకు దిగారు.

  సోమవారం రోజు మంగళగిరి ఎమ్యేల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కనుబడటంలేదంటూ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రైతులు. ఓవైపు అమరావతి రాజధాని తరలిపోతుందని రైతులు ఆందోళనలు చేస్తుంటే.. మరోవైపు ఎమ్మెల్యే ఆళ్ల అడ్రస్ లేకుండా పోయారంటున్నారు రైతులు. దీంతో ఆయన కనిపిస్తే వెతికి పెట్టడంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు.
  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Ap capital, Ap cm ys jagan mohan reddy, AP Politics, Vundavalli sridevi, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు