పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను తరిమి... కేకు తొక్కిన వైస్ ప్రిన్సిపాల్

ఆ భావనతోనే తాను కొంత అత్యుత్సాహం ప్రదర్శించానని ఆయన అంగీకరించారు. ఆ కేక్‌ను తోసేయకుండా దాచిపెట్టి తర్వాత ఇవ్వాల్సిందన్నారు వైస్ ప్రిన్సిపాల్.

news18-telugu
Updated: September 2, 2019, 9:50 AM IST
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను తరిమి... కేకు తొక్కిన వైస్ ప్రిన్సిపాల్
పవన్ కళ్యాణ్ (Image:Janasena Party/Twitter)
news18-telugu
Updated: September 2, 2019, 9:50 AM IST
పవన్ కల్యాణ్ పుట్టినరోజున ఆయన అభిమానులకు ఓ కాలేజ్ ప్రిన్సిపాల్ షాక్ ఇచ్చారు. పవన్ బర్త్‌డే వేడుకలు చేసుకునేందుకు  భారీ ఎత్తున ఓ ఇంజినీరింగ్ కాలేజ్ వద్దకు చేరుకున్నారు ఆయన ఫ్యాన్స్. సెప్టెంబర్ 2న వినాయకచవితి సెలవు దినం కావడంతో.. ఏపీలోని చాలా ఇంజినీరింగ్ కాలేజీల్లో ఆయన బర్త్ డే సెల్రబేషన్స్ జరిపారు. తాడేపల్లిగూడెంలోని శశి విద్యాసంస్థల ఎదురుగా కొందరు అభిమానులు పవన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని అంతా సిద్ధం చేశారు.

ఒక్కొక్కరు చందాలు వేసుకొని 25 కిలోల  భారీ కేక్‌ను కూడా తెప్పించారు. అయితే ఆ కేక్‌ను కట్ చేయకుండా కాలేజ్ వైస్ ఛైర్మన్ నరేంద్రనాథ్ మేకా అడ్డకున్నారు. అంతటితో ఆగకుండా కేక్‌ను కూడా కిందపడేసి కాలుతో తొక్కారు. దీంతో ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ ఆగ్రహంతోఊగిపోయారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో పోలీసులు కలుగచేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. పవన్ ఫ్యాన్స్‌ను అక్కడి నుంచి పంపించేశారు. నరేంద్ర మేకా తీరును నిరసిస్తూ.. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు రోడ్డు మీద బైఠాయించి నినాదాలు చేశారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశాన్ని కాలేజీ ఫేస్‌బుక్ పేజీ ద్వారా నరేంద్ర మేకా వివరణ ఇచ్చారు.పవన్ కళ్యాణ్ ఆశయాలకు, భావాలకు తాను విరోధిని కానన్న నరేంద్ర మేకా.. ఆయన జన్మదిన వేడుకల్లో విద్యార్థులే కాకుండా బయట వ్యక్తులు కూడా వచ్చారన్నారు. మూడు రోజులు సెలవు కావడంతో హాస్టల్‌లో ఉండే ఆడపిల్లలను తీసుకెళ్లడం కోసం వాళ్ల తల్లిదండ్రులు వచ్చారని.. వారి ముందు కాలేజీకి చెడ్డ పేరు వస్తుందనే భావనతోనే తాను కొంత అత్యుత్సాహం ప్రదర్శించానని ఆయన అంగీకరించారు. ఆ కేక్‌ను తోసేయకుండా దాచిపెట్టి తర్వాత ఇవ్వాల్సిందన్నారు. చేసిన దానికి ఆయన పశ్చాతాపం వ్యక్తం చేశారు. అయితే జనసేన కార్యకర్తల వాదన మాత్రం మరోలా ఉంది. గతంలో పరిటాల రవి జయంతి వేడుకలు కాలేజ్ ఆవరణలోనే జరిపారంటున్నారు. ఇప్పుడు పవన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ మాత్రం అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

First published: September 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...