శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరిరోజు చక్రస్నానంపై పృధ్వీ మాట్లాడిన ప్రోమో లీక్ అయ్యింది. అయితే ఇందులో విషయం ఏముంది అనుకుంటున్నారు. ఆ ప్రోమో వల్ల ఇప్పుడు ఫృథ్వీ నలుగురిలో నవ్వుల పాలు అవుతున్నారు. చక్రస్నానం పుష్కరిణి సమయంలోనే అక్కర్లేదు, 24 గంటల్లో ఎప్పుడైనా చేయొచ్చంటూ ఫృథ్వీ ఓ ప్రోమో చేశారు. అయితే ఈ వీడియో తెలుగులో బాగానే వచ్చినా, తమిళంలో మాత్రం డైలాగులు చెప్పేందుకు పృధ్వీరాజ్ కింద మీద పడ్డారు.ఆ సమయంలో తడబడటంతో పక్కనే ఉన్న కొందరు అతనికి డైలాగులు అందించారు.
దీంతో సరిగా రాని కారణంగా తమిళ వీడియో ఎస్వీబీసీ అధికారులు పక్కన పెట్టేశారు. కానీ కొందరు సిబ్బంది ఆ వీడియోను రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఫథ్వీ తడబడిన వీడియో ఇప్పుడు అంతటా వైరల్ అయ్యింది. విషయం గుర్తించిన ఎస్వీబీసీ అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు ఫృథ్వీ కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. తన వీడియో లీక్ చేయడంపై అమెరికాలో ఉన్న పృధ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Published by:Sulthana Begum Shaik
First published:October 13, 2019, 11:45 IST