సీఎం జగన్‌ కాళ్లు పట్టుకొనైనా... ఎస్వీబీసీ ఉద్యోగులకు పృథ్వీరాజ్ భరోసా

త్వరలోనే ఎస్వీబీసీ చానల్ ప్రసారాలు హిందీలోనూ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు సినీ నటుడు పృథ్వీ తెలిపారు.

news18-telugu
Updated: August 17, 2019, 3:26 PM IST
సీఎం జగన్‌ కాళ్లు పట్టుకొనైనా... ఎస్వీబీసీ ఉద్యోగులకు పృథ్వీరాజ్ భరోసా
వైఎస్ జగన్ పృథ్వీ రాజ్
  • Share this:

ఇటీవలే శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ)కి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సినీనటుడు పృథ్వీరాజ్

ఎస్వీబీసీ ఉద్యోగులకు అండగా నిలిచారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ కాళ్లు పట్టుకునైనా ఎస్వీబీసీ సిబ్బంది ఉద్యోగాలను పర్మినెంట్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎస్వీబీసీలో పనిచేస్తున్న 286 మంది ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూప్తానని స్పష్టం చేశారు.త్వరలో ఎస్వీబీసీ చానల్ ప్రసారాలు హిందీలోనూ తీసుకువచ్చేందుకు ప్రయతిస్తున్నట్టు పృథ్వీ తెలిపారు.  తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని, తిరుమల క్షేతంలో రాజకీయాలకు తావులేదన్నాయన. ఎస్వీబీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆధార్, ఓటర్ కార్డులను తిరుపతికే మార్చుకున్నానని చెప్పారు. ఇటీవలే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మట్లాడుతూ... సీఎం జగన్ ను ఎవరు విమర్శించినా తాట తీస్తానని  వార్నింగ్ ఇచ్చారు పృథ్వీ.
చిత్తూరులోని చంద్రగిరిలో వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పృథ్వీ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితం పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ కొత్త ముఖ్యమంత్రి అయితే వారిని కళాకారులు ఖచ్చితంగా కలవాలనే రూల్ ఏమీ లేదని కామెంట్ చేశారు.
Loading...

First published: August 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...