news18-telugu
Updated: October 7, 2019, 2:26 PM IST
కొన్నిసార్లు కరోనా ఉన్నప్పటికీ నెగిటివ్ వస్తుందని వైద్యులు చెప్పారని వెల్లడించిన పృథ్వీ... వారి సూచన మేరకు క్వారంటైన్లో ఉంటున్నానని అన్నారు.
ప్రముఖ కమెడియన్, ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పృథ్వీ మరోసారి వార్తాల్లో నిలిచారు. ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాడ్డాక.. ఆయనను శ్రీవెంకటేశ్వర ఛానల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్నట్నుంచి ఆయన తన మాటతీరులో పృథ్వీ కాస్త పదును పెంచారు. తాజాగా టాలీవుడ్లో కొందరి ప్రముఖుల్ని టార్గెట్ చేస్తూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సింగర్ సునీతను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని టార్గెట్ చేస్తూ చేసిన ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. శ్రీవెంకటేశ్వర స్వామి వాహనాల గురించి తాను ఎస్ వి ఛానల్ తరపున ఒక ప్రత్యేక కార్యక్రమం చేసేందుకు ... సినీ ఇండస్ట్రీలో కొందరిని అడిగితే... రోజుకు రెండు లక్షలు ఇమ్మని అడిగారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
కీరవాణి, సునీత లాంటి వాళ్ళ అవసరం తమ ఎస్వీబీసీ ఛానల్‌కు లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. వారి స్థాయితో సమానమైన అద్భుతమైన గాయకులు, సంగీత దర్శకులు తిరుపతిలోనే ఉన్నారన్నారు.ఎస్వీబీసీ ఛానల్ కోసం నెలకు 20 రోజులు తిరుపతిలోనే ఉండి పనిచేస్తూన్నా అన్నారు ఫృథ్వీ. ఛానల్ కోసం తనకు వచ్చే లక్షలాది రూపాయల ఆదాయాన్ని వదులుకున్నానన్నారు ఫృథ్వీ. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులపై మరోసారి పృథ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Published by:
Sulthana Begum Shaik
First published:
October 7, 2019, 2:26 PM IST