సీఎం జగన్‌కు 30 ఇయర్స్ పృథ్వీ చిరుకానుక..

సినిమా ఇండస్ట్రీకి జగన్ సీఎం కావడం ఇష్టం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని రోజుల క్రితం తీవ్ర దుమారం రేపాయి.

news18-telugu
Updated: September 13, 2019, 7:54 PM IST
సీఎం జగన్‌కు 30 ఇయర్స్ పృథ్వీ చిరుకానుక..
సీఎం జగన్‌ను సత్కరించిన పృథ్వీ రాజ్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, వైసీపీ నేత, 30 ఇయర్స్ పృథ్వీ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి తిరుమల శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. జగన్ మోహన్ రెడ్డిని తొలుత శాలువతో సత్కరించారు. అనంతరం పూలమాల వేసిన పృథ్వీ.. ఆ తర్వాత ఓ చిరుకానుక అందించారు. శ్రీవేంకటేశ్వరుని తిరునామం, శంఖచక్రాలు ఉన్న జ్ఞాపికను బహూకరించారు. 30 ఇయర్స్ పృథ్వీతోపాటు పలువురు వేదపండితులు కూడా వచ్చి సీఎం జగన్‌ను ఆశీర్వదించారు. 30 ఇయర్స్ పృథ్వీగా సినిమాల్లో సుపరిచితుడైన పృథ్వీరాజ్‌ను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు చైర్మన్‌గా నియమించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. సినిమా ఇండస్ట్రీకి జగన్ సీఎం కావడం ఇష్టం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని రోజుల క్రితం తీవ్ర దుమారం రేపాయి. ఎస్వీబీసీలో రాజకీయాలు చేయబోనని స్పష్టంచేసిన ఆయన అందులో పనిచేసే వారి శ్రేయస్సు కోసం తాను కృషి చేస్తానన్నారు. సహజంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి శాలువాలు, సత్కారాలు, పూలదండలకు దూరంగా ఉంటారు. అయితే, తన డైహార్డ్ ఫ్యాన్ అయిన 30 ఇయర్స్ పృథ్వీ ఒత్తిడి చేయడంతో ఆయన ఏమీ అనకుండా ఉండిపోయారని తెలిసింది.
First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading