హోమ్ /వార్తలు /రాజకీయం /

వైసీపీ పెద్దల క్లాస్... దిగొచ్చిన పృథ్వీ... పోసాని ముందు ఓ ప్రతిపాదన...

వైసీపీ పెద్దల క్లాస్... దిగొచ్చిన పృథ్వీ... పోసాని ముందు ఓ ప్రతిపాదన...

పోసాని, పృథ్వీ

పోసాని, పృథ్వీ

ఆందోళనలు చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీ దిగొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆందోళనలు చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీ దిగొచ్చారు. తాను రైతుల గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని, మాట్లాడనని చెప్పారు. పృథ్వీ వ్యాఖ్యల మీద సినీ నటుడు, రచయిత,వైసీపీ నేత పోసాని కృష్ణమురళి తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్ని మంచి పనులు చేస్తున్నా పృథ్వీ లాంటి వారు చేసే వ్యాఖ్యల వల్ల వైసీపీకి చెడ్డపేరు వస్తోందన్నారు. అయితే, పోసాని వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు పృథ్వీ రాజ్. అయితే, 24 గంటల్లోనే మళ్లీ దిగొచ్చారు.

‘నేను రైతుల గురించి తప్పుగా మాట్లాడట్లేదు. మాట్లాడను కూడా. నేను చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినే. రైతుల ముసుగులో బినామీలు చేస్తున్న దౌర్జన్యం మీద మాట్లాడా. మిమ్మల్ని కించపరచలేదు. చేయను కూడా. రైతు సోదరులు అర్థం చేసుకోవాలి. నేను రైతులను కడుపుకి అన్నం తింటున్నా. గడ్డి తినడం లేదు. రైతులంటే ఇష్టం. రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారు?

తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నా. రైతుల గురించి పల్లెత్తు మాట తప్పుగా మాట్లాడలేదు. కావాలంటే నా రికార్డు చూడండి.’ అని పృథ్వీ రాజ్ అన్నారు.

పోసాని కృష్ణమురళితో వివాదంపై కూడా 30 ఇయర్స్ పృథ్వీ స్పందించారు. ‘పోసాని, నేను చిరపరిచితులం. మా ఇద్దరి మధ్య ఎందుకు మిస్ కమ్యూనికేషన్ వచ్చిందో తెలీదు. ఏ రోజూ మేం ఇద్దరం తిట్టుకున్నది లేదు. కొట్టుకున్నది లేదు. పోసాని బ్రదర్... మనిద్దరి మధ్య స్నేహం అలాగే ఉంది. మీ నుంచి నేను చాలా సార్లు స్ఫూర్తి పొందా. మాట తప్పని మడమ తిప్పని నైజాన్ని మీ నుంచి నేను నేర్చుకున్నా. మనిద్దరి మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకోవాలని అందరూ చూస్తున్నారు. సోదరా మీరు బాగుండాలి. మిస్ కమ్యూనికేషన్‌ను పీడకలలా భావించి నన్ను కలుపుకోవాలి.’ అని పృథ్వీ కోరారు.

First published:

Tags: 30 Years Prudhvi Raj, Amaravati, Ap cm ys jagan mohan reddy, Posani Krishna Murali, Ysrcp

ఉత్తమ కథలు