అమరావతిలో ధర్నాలపై 30 ఇయర్స్ పృథ్వీ సంచలన కామెంట్స్...

అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని కొనసాగించాలంటూ ధర్నా చేస్తున్న రైతులను ఉద్దేశించి వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: January 4, 2020, 9:37 PM IST
అమరావతిలో ధర్నాలపై 30 ఇయర్స్ పృథ్వీ సంచలన కామెంట్స్...
కమెడియన్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పృధ్వీ
  • Share this:
అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని కొనసాగించాలంటూ ధర్నా చేస్తున్న రైతులను ఉద్దేశించి వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతుల పేరుతో ఆందోళనలు చేస్తోంది పెయిడ్ ఆర్టిస్టులేనని చెప్పారు. వారు నిజంగా రైతులే అయితే, ధర్నాలు చేస్తున్న వారి వద్ద ఆడికార్లు, మహిళలకు బంగారు గాజులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అమరావతిలో రైతుల పేరుతో ఓకార్పొరేట్ ఉద్యమం నడుస్తోందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అమరావతిలో జరుగుతున్న ఈ అంశాలు కనిపించడం లేదా? అని పృథ్వీ ప్రశ్నించారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ గత కొన్ని రోజులుగా 29 గ్రామాల్లోని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే, ధర్నాలు చేసేవారంతా రైతులు కాదంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి టీడీపీ కార్యకర్తలను తీసుకొచ్చి ధర్నాలు చేయిస్తున్నారని కొందరు, పెయిడ్ ఆర్టిస్టులంటూ మరికొందరు వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలను నిరసనకారులు ఖండించారు. తాము ఏ గ్రామానికి చెందిన వారిమో ఆధార్ కార్డులు చూపించాలా అని ప్రశ్నించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 4, 2020, 9:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading