కవితపైనే అందరి దృష్టి... కేసీఆర్ మనసులో ఏముంది ?

కవిత పొలిటికల్ కెరీర్ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై నెలకొన్న సస్పెన్స్ కొనసాగుతోంది.

news18-telugu
Updated: January 26, 2020, 7:10 PM IST
కవితపైనే అందరి దృష్టి... కేసీఆర్ మనసులో ఏముంది ?
కేసీఆర్, కవిత (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. చాలామంది ఊహించినట్టుగానే ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవా కొనసాగింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడప్పుడే టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చే రాజకీయ పార్టీ లేదనే విషయం మరోసారి తేలిపోయింది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్... అనేక అంశాలపై మరోసారి తమ పార్టీ వైఖరి ఏమిటన్న అంశంపై క్లారిటీ ఇచ్చారు. మిగతా అంశాల సంగతి ఎలా ఉన్నా... ఈ ఎన్నికల తరువాత కేటీఆర్‌ను తెలంగాణ సీఎం చేసేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నారనే ప్రచారం జరిగింది.

దీనిపై స్పందించిన కేసీఆర్... మరికొంతకాలం తెలంగాణ ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలతో కేటీఆర్‌కు ఇప్పుడప్పుడే పట్టాభిషేకం ఉండకపొవచ్చనే వాదన జోరందుకుంది. ఇదిలా ఉంటే... సీఎం కేసీఆర్ తన కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పొలిటికల్ కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై నెలకొన్న సస్పెన్స్ మాత్రం కంటిన్యూ అవుతోంది.

త్వరలోనే ఖాళీ కాబోయే రాజ్యసభ స్థానాల్లో ఒక సీటును కవితకు ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్‌లో జరగబోయే ఈ ఎన్నికల్లో కవిత ఎంపీగా మళ్లీ ఢిల్లీ వెళతారా ? అసలు ఈ విషయంలో కేసీఆర్ మనసులో ఏముందనే దానిపై మరోసారి చర్చ మొదలైంది. ఫిబ్రవరి నుంచే దీనిపై చర్చ మొదలయ్యే అవకాశం ఉండటంతో... కవిత పొలిటికల్ ఫ్యూచర్‌పై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా ? అన్నది ఉత్కంఠ రేపుతోంది.First published: January 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు