సత్తెనపల్లి పంచాయతీ...కోడెలపై చంద్రబాబు నిర్ణయమేంటి ?

2014 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశాల మేరకు బలవంతంగా సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన కోడెల శివప్రసాదరావు... అక్కడి నుంచి విజయం సాధించారు.

news18-telugu
Updated: August 7, 2019, 3:50 PM IST
సత్తెనపల్లి పంచాయతీ...కోడెలపై చంద్రబాబు నిర్ణయమేంటి ?
కోడెల, చంద్రబాబు
news18-telugu
Updated: August 7, 2019, 3:50 PM IST
టీడీపీలో సత్తెనపల్లి పంచాయతీ పతాకస్థాయికి చేరుకుంది. సత్తెనపల్లి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కోడెల శివప్రసాదరావును తొలగించాలని నియోజకవర్గంలోని మరో వర్గం టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వారంతా చంద్రబాబును కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. ఆయన కూడా వీరికి సమయం ఇవ్వడంతో... కోడెల విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఒత్తిడి మేరకు బలవంతంగా సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన కోడెల శివప్రసాదరావు... అక్కడి నుంచి విజయం సాధించారు. అనంతరం ఏపీకి స్పీకర్ అయ్యారు.

అయితే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు కుమారుడు, కూతురు నియోజకవర్గంలో బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఇటీవల వారిపై అనేక కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కోడెల కుటుంబంపై నియోజకవర్గ టీడీపీలో అసంతృప్తి కూడా మొదలైంది. గత ఎన్నికలకు ముందే కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా టీడీపీలోని మరో వర్గం ఆయనపై తిరుగుబాటు చేసింది. అయితే అధినేత వద్ద తనకున్న పలుకుబడి కారణంగా కోడెల ఎన్నికల్లో టికెట్ తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఆయన ఓడిపోయారు. ఆ తరువాత నియోజకవర్గంలో కోడెలపై పార్టీపరంగా తిరుగుబాటు మొదలైంది.

తాజాగా మరోసారి టీడీపీ నేతలు కోడెలకు వ్యతిరేకంగా ఏకమై చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన వల్లే సత్తెనపల్లిలో టీడీపీ పరిస్థితి దిగజారిపోయిందని... ఆయనను నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయనున్నారు. దీంతో కోడెల విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. కోడెలను సత్తెనపల్లి ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తప్పిస్తారా లేక అసంతృప్తులను బుజ్జగిస్తారా అన్నది పార్టీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.First published: August 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...