ఈటల మంత్రి పదవిపై సస్పెన్స్... వేటు పడుతుందా ?

సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్

బీసీ సామాజికవర్గానికి చెందిన ఈటల రాజేందర్ నుంచి కేబినెట్ నుంచి తప్పించేందుకే బీసీ వర్గానికి చెందిన గంగుల కమలాకర్‌ను కేబినెట్‌లోకి తీసుకోబోతున్నారనే ప్రచారం కూడా రాజకీయవర్గాల్లో మొదలైంది.

  • Share this:
    మరికొద్ది గంటల్లోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనున్న తరుణంలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే అంశంపై ఓ క్లారిటీ వస్తోంది. కేటీఆర్, హరీశ్ రావు సహా మరో నలుగురికి మంత్రి పదవులు ఖరారైనట్టు తెలుస్తోంది. కొత్తగా మంత్రి పదవులు దక్కించుకునే వారి సంగతి ఎలా ఉన్నా... విస్తరణలో భాగంగా ఎవరినైనా కేబినెట్ నుంచి తొలగిస్తారా అనే అంశంపై కూడా ఉత్కంఠ కొనసాగింది. కొద్దిరోజల క్రితం మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారడంతో...ఆయనను కేబినెట్ నుంచి తొలిగించే అవకాశం లేకపోలేదని ఊహాగానాలు వినిపించాయి.

    అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈటలను మంత్రివర్గం నుంచి తప్పిస్తారా లేక ఆయనను కూడా కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఉమ్మడి కరీంనగర్ నుంచి ప్రస్తుతం కొప్పుల ఈశ్వర్‌, ఈటల రాజేందర్ మంత్రివర్గంలో ఉన్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కేటీఆర్, గంగుల కమలాకర్‌ కేబినెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కేబినెట్‌లో మంత్రులుగా ఉండే వారి సంఖ్య నాలుగుకు చేరుతుంది. ఈ క్రమంలో ఈటలను తప్పిస్తారా అన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.

    మరోవైపు బీసీ సామాజికవర్గానికి చెందిన ఈటల రాజేందర్ నుంచి కేబినెట్ నుంచి తప్పించేందుకే బీసీ వర్గానికి చెందిన గంగుల కమలాకర్‌ను కేబినెట్‌లోకి తీసుకోబోతున్నారనే ప్రచారం కూడా రాజకీయవర్గాల్లో మొదలైంది. అయితే కేవలం ఈటలను మాత్రమే తప్పించకుండా ఆయనతో పాటు మరో మంత్రిని కూడా కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ఈటల మంత్రి పదవి భవితవ్యం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

    First published: