అచ్చమైన భారతీయతకు నిలువెత్తు రూపం సుష్మాస్వరాజ్.. అడగ్గానే సాయం చేసే చిన్నమ్మ..

Sushma Swaraj: సుష్మ గురించి చెప్పుకోవాలంటే మొదటగా ఆమె ఆహార్యాన్నే ప్రస్తావించాలి. నేరు పాపిడి, పెద్ద బొట్టు, ప్లెయిన్ చీర జాకెట్, పైన కోటు మోడల్ జాకెట్.. ఇలా తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 7, 2019, 5:21 PM IST
అచ్చమైన భారతీయతకు నిలువెత్తు రూపం సుష్మాస్వరాజ్.. అడగ్గానే సాయం చేసే చిన్నమ్మ..
సుష్మా స్వరాజ్ (2019 ఆగస్ట్ 6)
  • Share this:
సుష్మాస్వరాజ్.. తెలంగాణ చిన్నమ్మగా సుపరిచితురాలు. కేంద్ర మంత్రి పదవి చేపట్టాక దేశానికే చిన్నమ్మ అయ్యారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా, కోట్లాది మంది మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె ఆహార్యం, మాట తీరు, సాయం చేసే మనస్తత్వం ఆమెను అందలమెక్కించాయి. తెలంగాణ ఏర్పాటులో ఆమె పాత్ర ఎంతో కీలకం. అప్పటి యూపీఏ ప్రభుత్వం పెట్టిన బిల్లుకు, తన పార్టీ తరఫున ముందుండి మద్దతు ఇచ్చారు. సుష్మ గురించి చెప్పుకోవాలంటే మొదటగా ఆమె ఆహార్యాన్నే ప్రస్తావించాలి. నేరు పాపిడి, పెద్ద బొట్టు, ప్లెయిన్ చీర జాకెట్, పైన కోటు మోడల్ జాకెట్.. ఇలా తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నారు. విదేశాలకు వెళ్లినపుడు, విదేశీ ప్రతినిధులతో మాట్లాడేటప్పుడు ఆమె శైలి ముచ్చటేస్తుంది.

జయలలిత అనగానే నుదుటిన చందనం, కాటన్ చీర.. నీలం రంగు బోర్డర్ కలిగిన తెల్లని చీరలో మమత, తనదైన ఆహార్యంతో షీలాదీక్షిత్.. ఇలా చాలా మంది కీలక మహిళా నేతలు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే, అందులో సుష్మాస్వరాజ్‌ది ప్రత్యేక స్థానం. ప్రశాంతత ఆమె మోములోనే కనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే అచ్చమైన భారతీయతకు నిలువెత్తు రూపం సుష్మ.

విదేశాల్లో కష్టాలు ఎదుర్కొంటున్నాం.. పాస్‌పోర్టు పోయింది.. స్వదేశానికి వచ్చేందుకు డబ్బుల్లేవ్.. అంటూ ట్విట్టర్‌లో మొర పెట్టుకోగానే త్వరితగతిన స్పందించే చిన్నమ్మ.. కేంద్ర విదేశాంగ మంత్రి హోదాలో స్వదేశీయులకే కాదు విదేశీయులకు కూడా చేయూతనందించారు. దాయాది పాక్ ప్రజలకు కూడా ఆమె ఆపన్నహస్తం అందించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: August 7, 2019, 5:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading