మసూద్‌ అజర్‌ను అప్పగించండి ... ఇమ్రాన్‌ ఖాన్‌కు సుష్మాస్వరాజ్ ఛాలెంజ్

మసూద్‌ను అప్పగించకుండా శాంతి సందేశాలు వల్లించకండి అంటూ ఇమ్రాన్ ఖాన్‌కు సుష్మా చురకలంటించారు.

news18-telugu
Updated: March 14, 2019, 1:22 PM IST
మసూద్‌ అజర్‌ను అప్పగించండి ... ఇమ్రాన్‌ ఖాన్‌కు సుష్మాస్వరాజ్ ఛాలెంజ్
సుష్మాస్వరాజ్ (File)
  • Share this:
పాకిస్థాన్ తీరుపై మరోసారి మండిపడ్డారు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ నిజంగా ఇరుదేశాల మధ్య శాంతిని కోరుకుంటే వెంటనే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను భారత్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. మసూద్‌ను అప్పగించకుండా శాంతి సందేశాలు వల్లించకండి అంటూ ఇమ్రాన్ ఖాన్‌కు సుష్మా చురకలంటించారు. భారత్‌తో పాకిస్థాన్ ప్రధానిగా సత్సంబంధాలు కోరుకుంటే ముందుగా మసూద్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు సుష్మా. ఇమ్రాన్‌కు అంత పెద్ద మనుసుంటే... మసూద్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

మరోవైపు ఇప్పటికే మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్‌ను చైనా మరోసారి అడ్డుపుల్ల వేసింది.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రకారం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించాయి. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే సభ్యదేశాలు పది పని దినాల్లోగా లేవనెత్తాలి. దీనికి బుధవారంతో గడువు ముగిసింది. చివరి నిమిషంలో సాంకేతిక కారణాలను చూపుతూ ఈ ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీగిపోయింది. మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం పదేళ్ల కాలంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

మరోవైపు సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులుకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 200 నుంచి 300 ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం చెబుతోంది.

Published by: Sulthana Begum Shaik
First published: March 14, 2019, 1:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading