Telangana: బండి సంజయ్‌పై దాడి జరిగిందా? సూర్యాపేట పోలీసులు ఏమంటున్నారు?

బండి సంజయ్

బండి సంజయ్‌పై దాడి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అండంతోనే స్వేరోస్ విర్రవీగుతోందని మండిపడుతున్నారు. ఆయన్ను చంపేందుకు కుట్రం జరుగుతోందని పలువురు బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలుచేశారు.

  • Share this:
    బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సూర్యాపేటలో దాడి జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. స్వేరోస్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఆయన్న వాహనంపై దాడి చేసినట్లు బీజేపీ తెలంగాణ యూనిట్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేసింది. ఐతే ఈ వార్తలపై సూర్యాటపేట పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో పర్యటించిన బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ దాడి జరిగింది అనడంలో వాస్తవం లేదని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్ భాస్కర్ అన్నారు. బుధవారం రాత్రి హుజూర్‌నగర్ పట్టణంలో మాట్లాడిన ఆయన.. కొందరు సామాజిక మాధ్యమాల్లో కావాలని ప్రచారం చేస్తున్నారని, బండి సంజయ్ వాహనశ్రేణిపై దాడి అవాస్తవమని స్పష్టం చేశారు.

    కోదాడ నుండి హైదరాబాద్ వెళ్లే క్రమంలో కొందరు స్వేరోస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్వల్ప ఉద్రిక్తత మాత్రమే నెలకొంది. అంతేగానీ వాహనశ్రేణిపై పై దాడి జరగలేదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చినట్టుగా సూర్యాపేట జిల్లా బిజెపి అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి వాహనం ధ్వంసం కాలేదు. బండి సంజయ్ వాహనశ్రేణి అడ్డుకున్న వారిని వీడియో ఫుటేజ్ ద్వారా గుర్తించి వారిపై కేసు నమోదు చేస్తాం. బండి సంజయ్ వాహనానికి ఏ అడ్డంకులు లేకుండా పోలీస్ బందోబస్తుతో హైదరాబాద్‌కు పంపించాం. అని ఎస్పీ భాస్కర్ పేర్కొన్నారు.

    కానీ బండి సంజయ్‌పై దాడి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అండంతోనే స్వేరోస్ విర్రవీగుతోందని మండిపడుతున్నారు. ఆయన్ను చంపేందుకు కుట్రం జరుగుతోందని పలువురు బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలుచేశారు.



    ఐతే బీజేపీ ఆరోపణలను టీఆర్ఎస్ నేతలు తిప్పికొడుతున్నారు. ప్రజల్లో సానుభూతి కోసం డ్రామాలు ఆడొద్దని మండిపడుతున్నారు. అటు స్వేరోస్ కార్యకర్తలు కూడా బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వేరోస్ సంస్థతో పాటు గురుకుల కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలును వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలని జై భీమ్ యూత్ ఇండియా, స్వేరోస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: