GHMC Elections: బీజేపీ గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్.. బండి సంజయ్ సంచలన వాఖ్యలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై మరో సారి సంచలన వాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. గ్రేటర్ ఎన్నికల్లో తాము విజయం సాధించగానే పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామని సంచలన వాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: November 24, 2020, 2:38 PM IST
GHMC Elections: బీజేపీ గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్.. బండి సంజయ్ సంచలన వాఖ్యలు
బండి సంజయ్(ఫైల్ ఫోటో)
  • Share this:
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ పార్టీల నడుమ మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై మరో సారి సంచలన వాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. గ్రేటర్ ఎన్నికల్లో తాము విజయం సాధించగానే పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామని సంచలన వాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీలో పాకిస్తానీలు, రోహింగ్యాలు నివాసం ఉంటూ ఓట్లు వేస్తున్నారని సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మేయర్ అవడం ఖామయని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఉప్పల్, రామంతపూర్‌లో సంజయ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిచారు. అభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఇది ఇలా ఉంటే గ్రేటర్ ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  ఈ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంతో తమకు తిరుగులేదని మరో సారి చాటాలని అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. దుబ్బాకలో తమకు ఎదురైన పరాజయం తాలుకు ప్రభావాన్ని ఈ ఎన్నికలతో తొలగించుకోవాలని కారు పార్టీ సీరియస్ గా ముందుకు సాగుతోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుండి జీహెచ్ఎంసీ ప్రచారాన్ని సాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ నిర్వహిచి పార్టీ మానిఫెస్టోను విడుదల చేయడం, అనేక హామీలను ఇవ్వడం  పరిశీలిస్తే ఆ పార్టీ ఈ ఎన్నికలను ఎంత సీరియస్ గా తీసుకుందనేది అర్థం చేసుకోవచ్చు.

దుబ్బాక విజయంతో జోష్ మీద ఉన్న బీజేపీ అదే ఊపుతో జీహెచ్ఎంసీపై కాషాయ జెండా ఎగుర వేయాలని వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రానికి చెందిన పార్టీ ముఖ్య నేతలంతా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, యూపీ ముఖ్య మంత్రి యోగీ ఆదిత్యనాథ్ సైతం బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక సంస్థ ఎన్నికల ప్రచారానికి జాతీయ స్థాయి నాయకులు వస్తున్నారంటే ఆ పార్టీ ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే విషయం అర్థం అవుతోంది.

ఇక కాంగ్రెస్ పార్టీ సైతం ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ఎన్నికల్లో కొన్ని సీట్లలో అయినా సత్తా చాటి ప్రజల్లో ఇంకా తమ పార్టీ ఉందని చాటాలని ఆ పార్టీ భావిస్తోంది. తద్వారా క్యాడర్ లో మళ్లీ జోష్ పెంచాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను భుజాలకు ఎత్తుకున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు ఒక్కటేనని విమర్శలు గుప్పిస్తూ తనదైన స్టైల్లో రేవంత్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.
Published by: Nikhil Kumar S
First published: November 24, 2020, 2:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading