కర్ణాటక ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సమర్థించిన సుప్రీం.. ఉపఎన్నికల్లో పోటీకి గ్రీన్ సిగ్నల్

సుప్రీం తీర్పు సీఎం యడియూరప్పకు, సదరు నేతలకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. డిసెంబర్ 18వరకు ఎలక్షన్ నామినేషన్స్‌కు గడువు ఉండటంతో బీజేపీ తరుపున వీరు నామినేషన్స్ వేసే అవకాశం ఉంది.

news18-telugu
Updated: November 13, 2019, 11:16 AM IST
కర్ణాటక ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సమర్థించిన సుప్రీం.. ఉపఎన్నికల్లో పోటీకి గ్రీన్ సిగ్నల్
అనర్హత వేటు పడ్డ కాంగ్రెస్,జేడీఎస్ ఎమ్మెల్యేలు
  • Share this:
కర్ణాటక కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలకు చెందిన 17మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సుప్రీంకోర్టు సమర్థించింది. అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ తీసుకున్న అనర్హత వేటును కోర్టు సమర్థించినట్టయింది. అదే సమయంలో అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు ఉపఎన్నికల్లో పోటీ చేయవచ్చునని కోర్టు తీర్పునిచ్చింది. అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కు ఉంటుందని.. అయితే 2023వరకు వారిపై వేటు వేయడం చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.వేటు విషయంలో కాలపరిమితిపై స్పీకర్‌కు అధికారాలు ఉండవని తెలిపింది. న్యాయమూర్తులు ఎన్వీ రమణ,సంజీవ్ ఖన్నా,కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం తీర్పును వెల్లడించింది.

సుప్రీం తీర్పు సీఎం యడియూరప్పకు, సదరు నేతలకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. డిసెంబర్ 18వరకు ఎలక్షన్ నామినేషన్స్‌కు గడువు ఉండటంతో బీజేపీ తరుపున వీరు నామినేషన్స్ వేసే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే,కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి రెబల్స్‌గా మారి పార్టీ ఫిరాయించినందుకు అప్పట్లో స్పీకర్ రమేశ్ కుమార్ 17మంది ఎమ్మెల్యేలపై వేటు వేశారు. 2023 వరకు వీరు ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రకటించారు.దీంతో 17మంది ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించగా.. అనర్హత వేటును సమర్థించిన న్యాయస్థానం కాలపరిమితిపై మాత్రం స్పీకర్‌కు అధికారాలు లేవని తేల్చేసింది.



First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...