• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • SUPREME COURT TO PRONOUNCE ITS ORDER TODAY ON MAHARASHTRA FLOOR TEST BS

నేడే ‘మహా’ తీర్పు.. సుప్రీం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ..

నేడే ‘మహా’ తీర్పు.. సుప్రీం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ..

ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్రలో రాజకీయ బలపరీక్షపై నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. సీఎం ఫడణవీస్‌కు మెజారిటీ ఉందా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. బలపరీక్ష జరపాలా వద్దా అనే అంశంపై తీర్పును వెలువరించనుంది.

 • Share this:
  మహారాష్ట్రలో రాజకీయ బలపరీక్షపై నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. సీఎం ఫడణవీస్‌కు మెజారిటీ ఉందా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. బలపరీక్ష జరపాలా వద్దా అనే అంశంపై తీర్పును వెలువరించనుంది. నిన్న సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, సంజీవ్ ఖన్నా, అశోక్ భూషణ్‌ల త్రిసభ్య ధర్మాసనం ముందు.. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని, ఎన్నికల ముందు పొత్తులపై ఆయనకు అవగాహన ఉందని సుప్రీంకోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి ఫడణవీస్ మధ్య సాగిన లేఖల వివరాలను కోర్టుకు సమర్పించారు. అటు.. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అజిత్ పవార్ తరఫున మణీందర్ సింగ్ వాదనలు వినిపించారు.

  అజిత్ పవార్ తన లేఖలో.. ‘అసలు ఎన్సీపీ నాదే. 54 మంది ఎమ్మెల్యేలు పార్టీ తరఫున తీసుకునే నిర్ణయాధికారాన్ని నాకు ఇచ్చారు. ఆ విషయంలో మరో మాట లేదు. నా కుటుంబంలో తలెత్తిన గొడవ తొందర్లోనే పరిష్కారం అవుతుంది’ అని తెలిపారు. అటు గవర్నర్ నిర్ణయాలను న్యాయస్థానాలు సమీక్షించకూడదు. బలపరీక్ష ఎప్పుడు జరపాలన్నది కూడా ఆయన నిర్ణయమే. ఫలానా రోజు బలపరీక్ష నిర్వహించాలని చెప్పే అధికారం సుప్రీం కోర్టుకు లేదు’ అని తుషార్ స్పష్టం చేశారు.

  ఇదిలా ఉండగా, 288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించగా.. శివసేన 56 సీట్లు గెలిచింది. ఎన్సీపీ 54, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 145 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. బీజేపీకి 11 మంది ఇండిపెండెంట్ల మద్దతు ఉంది. ఇంకా 29 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అంత మంది అజిత్ పవార్ వర్గం నుంచి వస్తారా అన్నది తేలాల్సిన అంశం. అటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు కలిపి 144 మంది సభ్యుల బలం ఉంది. కొందరు ఇండిపెండెంట్లు కూడా ఎన్సీపీకి సపోర్ట్ ఇస్తున్నారు. అందువల్ల ఆ కూటమి ప్రభుత్వం గట్టెక్కే ఛాన్స్ ఉంటుంది. కానీ... ఎన్సీపీలో రెబెల్స్ అందుకు సపోర్ట్ చేస్తారా అన్నది శరద్ పవార్‌ను వెంటాడుతున్న భయం.
  First published:

  అగ్ర కథనాలు