ఆ 17మంది భవితవ్యం.. సుప్రీం తీర్పు షాక్ ఇస్తుందా?

Supreme Court to deliver Verdict on pleas of disqualified Karnataka MLA's : ఎన్వీ రమణ,సంజీవ్ ఖన్నా,కృష్ణ మురారిలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం దీనిపై తీర్పు వెలువరించనుంది. అక్టోబర్ 25న దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

news18-telugu
Updated: November 13, 2019, 8:06 AM IST
ఆ 17మంది భవితవ్యం.. సుప్రీం తీర్పు షాక్ ఇస్తుందా?
సుప్రీంకోర్టు
  • Share this:
కర్ణాటక కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలకు చెందిన 17మంది అనర్హత ఎమ్మెల్యేల భవితవ్యంపై నేడు సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఎన్వీ రమణ,సంజీవ్ ఖన్నా,కృష్ణ మురారిలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం దీనిపై తీర్పు వెలువరించనుంది. అక్టోబర్ 25న దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండు రావు ధీమా వ్యక్తం చేయగా.. అనర్హత ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. దీంతో సుప్రీం తీర్పు ఎవరికి షాక్ ఇవ్వనుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

కాగా,కర్ణాటకలో కాంగ్రెస్,జేడీఎస్ ప్రభుత్వానికి రెబల్స్‌గా మారి.. ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రయోగించారు. 13 మంది కాంగ్రెస్,నలుగురు జేడీఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారంతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంలో ఆ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే కర్ణాటకలోని 15 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. అనర్హత వేటు పడటంతో అందులో పోటీ చేసే అవకాశం వారికి లేకుండా పోయింది. దీంతో సుప్రీం తీర్పు వచ్చేంతవరకు ఉపఎన్నికలను నిలిపివేయాల్సిందిగా వారు సుప్రీంను కోరారు. ఈ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా సుప్రీం ఈసీకి సూచించగా.. ఎన్నికల తేదీలను వాయిదా వేశారు. తాజాగా ప్రకటించిన తేదీల ప్రకారం.. డిసెంబర్ 5న ఉపఎన్నికలు,9వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. నేటి సుప్రీం తీర్పు వారికి అనుకూలంగా వస్తే.. ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వారికి దక్కుతుంది. లేనిపక్షంలో తమ కుటుంబ సభ్యులకైనా టికెట్లు ఇప్పించుకోవాలని వారు భావిస్తున్నారు.
First published: November 13, 2019, 8:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading