ఏపీ స్థానిక ఎన్నికలు .. సీఎం జగన్‌కు షాక్ ఇచ్చిన సుప్రీం.. అయితే..

Local body elections in AP : ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

news18-telugu
Updated: March 18, 2020, 12:14 PM IST
ఏపీ స్థానిక ఎన్నికలు .. సీఎం జగన్‌కు షాక్ ఇచ్చిన సుప్రీం.. అయితే..
సీఎం జగన్, సుప్రీం కోర్టు
  • Share this:
ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల కమిషన్‌ ఇష్టమని స్పష్టం చేసింది. అయితే, ఎన్నికల కోడ్‌ను తక్షణమే ఎత్తివేయాలని సుప్రీం ఎలక్షన్ కమిషన్‌ను ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కోడ్ ఎత్తివేయాలని సూచించింది. కొత్త పథకాలను తీసుకురావొద్దని మాత్రం జగన్ ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. ఉన్న పథకాలను మాత్రం కంటిన్యూ చేసుకోవచ్చని కోర్టు తేల్చి చెప్పింది. అటు.. ఎన్నికల నిర్వహణ తేదీ గురించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని ఈసీకి సూచించింది.

కాగా, కరోనా నేపథ్యంలో ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కు కులం పేరు ఆపాదించడం సంచలనం రేపింది. వైసీపీ నేతలు కూడా ఆయనపై మండిపడ్డారు. అదే సమయంలో.. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కూడా ఈసీకి లేఖ రాశారు. దానిపై వివరణ ఇస్తూ 3 పేజీల ప్రత్యుత్తరాన్ని రమేశ్ రాసిన సంగతి తెలిసిందే.
Published by: Shravan Kumar Bommakanti
First published: March 18, 2020, 12:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading