జామియా వర్సిటీ అత్యవసర పిటిషన్‌పై విచారణకు సుప్రీం 'నో'

ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో అల్లర్లపై దాఖలైన అత్యవసర పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు నిరాకరించింది.

news18-telugu
Updated: December 16, 2019, 11:24 AM IST
జామియా వర్సిటీ అత్యవసర పిటిషన్‌పై విచారణకు సుప్రీం 'నో'
జామియా వర్సిటీ విద్యార్థుల నిరసనలపై పోలీసుల లాఠీచార్జి
  • Share this:
ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో అల్లర్లపై దాఖలైన అత్యవసర పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు నిరాకరించింది. న్యాయవాదులు ఇందిరా జైసింగ్,కొలిన్ గొన్‌సాల్వెస్ టాప్ కోర్టు జడ్జిలను వర్సిటీకి పంపించి విచారణ జరిపించాలని కోరగా..దీనిపై రేపు విచారణ చేపడుతామని స్పష్టం చేసింది. ఇది శాంతిభద్రతలకు సంబంధించిన సమస్య అని, వర్సిటీలో ముందు శాంతియుత వాతావరణం నెలకొనాలని పేర్కొంది. శాంతియుత నిరసనలకు తాము వ్యతిరేకం కాదని తెలిపింది. 'మొదట అల్లర్లకు ఫుల్ స్టాప్ పడాలి. అల్లర్లు ఎలా చెలరేగుతాయో మాకు బాగా తెలుసు. ఇలాంటి వాతావరణంలో ఈ పిటిషన్‌పై విచారణ జరపలేం. ముందు అల్లర్లను ఆపండి.' అని ధర్మాసనం స్పష్టం చేసింది.

కాగా,పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ విద్యార్థులు పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదుట నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆందోళనలు హింసకు దారితీసి.. పలు బస్సుల్ని తగలబెట్టిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆపై పోలీసులు వర్సిటీలోకి చొరబడి పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించి అల్లర్లకు పాల్పడ్డారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అలాగే బస్సులను తగలబెట్టింది కూడా వారేనని ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నది
వేచి చూడాలి.First published: December 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు