Home /News /politics /

SUPREME COURT REFUSES BJP TO CONTINUE RATH YATRA IN WEST BENGAL PS

బీజేపీకి షాకిచ్చిన సుప్రీం కోర్టు.. ఆనందంలో దీదీ

supreme amitshah mamata

supreme amitshah mamata

దేశమంతా ప్రభావం చూపగలుగుతున్న బీజేపీ.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అడుగుపెట్టలేక పోతోంది. అలాంటి రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాళ్ ఒకటి. ఆ రాష్ట్రంలో బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.

    2019 పార్లమెంట్ ఎన్నికల్లోగా పశ్చిమ బెంగాళ్‌లో బలపడాలన్న కసితో పనిచేస్తున్న కమలదళానికి.. గట్టి షాకే తగిలింది. ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ.. బేజేపీకి కొరకరాని కొయ్యగా తయ్యారైన సందర్భంలో న్యాయస్థానం రూపంలో మరో అడ్డంకి ఎదురైంది. రాష్ట్రంలోని 42 పార్లమెంట్ స్థానాలను రథయాత్ర పేరుతో చుట్టేయాలన్న ఆ పార్టీ ఆశల్ని.. అత్యున్నత న్యాయస్థానం ఒక్క తీర్పుతో పన్నీరులో కలిపేసింది. బీజేపీ చేపట్టిన రథయాత్రకు బ్రేక్ వేసింది. యాత్రను నిలిపివేయాలని తీర్పునిచ్చింది. రథయాత్ర కాకుండా.. మామూలు ర్యాలీలు ప్లాన్ చేసుకోవాలని సూచించింది. దీంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యాయి.

    bjp rathyatra, bjp rathyatra in west Bengal, tmc, west Bengal cm mamata benarji, supreme court, bjp president amitshah, బీజేపీ రథయాత్ర, పశ్చిమ బెంగాళ్‌లో బీజేపీ రథయాత్ర, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పశ్చిమ బెంగాళ్ సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ
    అమిత్ షా, మమతా బెనర్జీ


    నిజానికి, షెడ్యూల్ ప్రకారం గత సంవత్సరం డిసెంబర్ 7న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా నేత‌ృత్వంలో కూచ్ బెహార్ నుంచి రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, బీజేపీ రథయాత్రను రాష్ట్రంలోని మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. రథయాత్రకు అనుమతిని నిరాకరించింది. కలకత్తా హైకోర్టు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన బీజేపీకి.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. తాజాగా తీర్పు వెలువరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. పశ్చిమ బెంగాళ్‌లో బీజేపీ రథయాత్రను నిలిపివేయాలని ఆదేశించింది. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. బీజేపీ రథయాత్రను కొనసాగించొద్దని చెప్పింది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఇతర మామూలు ర్యాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అయితే, రాష్ట్రంలో బీజేపీ రథయాత్రను నిలిపివేయడం ప్రజాస్వామ్య హక్కును కాలరాయడమేనంటూ బీజేపీ చేసిన వాదనను కోర్టు తోసి పుచ్చింది.

    రథయాత్రపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో బీజేపీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోగా.. తృణముల్ నేతలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. బీజేపీపై దీదీ సాధించిన గొప్ప విజయంగా అభివర్ణిస్తున్నారు.
    Published by:Santhosh Kumar Pyata
    First published:

    Tags: Amit Shah, Bjp, Mamata Banerjee, Supreme Court, TMC, West Bengal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు