శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ సహా, మరో 65 పిటిషన్లపై ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ.. శబరిమల తీర్పు రివ్యూతో పాటు అనే పిటిషన్లు మా ముందుకు వచ్చాయని చెప్పారు. ప్రతీ ఒక్కరికి మత స్వేచ్ఛ ఉందని, మతంలో అంతర్గత విషయం ఏంటనేది తేల్చడమే తమ ముందున్న పని అని ఆయన అన్నారు. దీనికోసం తీర్పును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేస్తున్నామని తెలిపారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బెంచీలో జడ్జిలు నారిమన్, చంద్రచూడ్ బదిలీ చేయడాన్ని విభేదించారు.
కాగా, గత ఏడాది సెప్టెంబరులో ఇచ్చిన తీర్పుపై మాత్రం స్టే ఇవ్వలేదు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.