Home /News /politics /

SUPREME COURT POSTPONED HEARING OF AP GOVT AND EMPLOYEES PETITION OVER PANCHAYAT ELECTIONS ISSUE SK

Andhra Pradesh: జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టులోనూ షాక్.. ఎన్నికల నిర్వహణ తప్పదా..?

నిమ్మగడ్డ రమేశ్ కుమార్, వైఎస్ జగన్(ఫైల్ ఫొటో)

నిమ్మగడ్డ రమేశ్ కుమార్, వైఎస్ జగన్(ఫైల్ ఫొటో)

Andhra Pradesh: ఇద్దరు ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించడంతో పాటు ఇద్దరు కలెక్టర్లు, ఒక ఎస్పీని బదిలీ చేయాలని, మరో ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్, డీజీపిలకు నిమ్మగడ్డ లేఖ రాశారు.

ఇంకా చదవండి ...
    పంచాయతీ ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసిన జగన్ సర్కార్‌కు అక్కడా ఎదురు దెబ్బ తప్పలేదు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం, ఏపీ ఉద్యోగ సంఘాల అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కారణంగా ఎన్నికలను నిర్వహించలేమని పిటిషన్‌లో పేర్కొంది. ఐతే ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని.. సోమవారం విచారిస్తామని స్పష్టం చేసింది. ఐతే శనివారమే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి రేపు నోటిఫికేషన్ విడుదల అయితే.. సోమవారం సుప్రీంకోర్టు విచారించినా ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి నోటిఫికేషన్ విడుదలయ్యాక.. సుప్రీంకోర్టు కూడా ఆపలేదని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే.. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

    మరోవైపు శనివారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో.. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై వేటువేశారు నిమ్మగడ్డ. ఇద్దరు ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించడంతో పాటు ఇద్దరు కలెక్టర్లు, ఒక ఎస్పీని బదిలీ చేయాలని, మరో ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్, డీజీపిలకు ఆయన లేఖ రాశారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీలను బదిలీ చేయాలని ఏపీ ఎస్ఈసీ ఆదేశించారు. పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలతో పాటు మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. మరి ఎస్ఈసీ ఆదేశాలను సీఎస్, డీజీపీ అమలు చేస్తారా? లేదా? అనేది చూడాలి.

    ఇక రేపు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని సిద్ధమవుతున్న ఎస్ఈసీ.. ఇందుకోసం పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించింది. మధ్యాహ్నం మూడు గంటలకు తమతో సమావేశం కావాలని గోపాలకృష్ణ ద్వివేది, గిరాజ శంకర్‌ను కోరింది. అయితే వారు ఈ సమావేశానికి రాలేదు. దీంతో వారిపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సీరియస్‌గా పరిగణించారు. చివరి అవకాశంగా సాయంత్రం 5 గంటలకు తన ముందు హాజరుకావాలని నిమ్మగడ్డ ఆదేశించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి మెమో జారీ చేసింది. కానీ ఇంకా హాజరుకాని నేపథ్యంలో.. వారి విషయంలో ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తిగా మారింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Gram Panchayat Elections, Nimmagadda Ramesh Kumar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు