అధిక ఫీజులు వసూలు చేసే కాలేజీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఫీజుల వ్యవహారంలో సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణకు చెందిన వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలకు సుప్రీంకోర్టు తన నిర్ణయింతో
షాక్కు గురిచేసింది. నియంత్రణ కమిటీ నిర్ణయం మేరకే ఫీజులు ఉండాలని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది. నియంత్రణ కమిటీకే ఫీజులు నిర్ణయించే అధికారం ఉంటుందని పేర్కొంది. హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని సుప్రీం అభిప్రాయపడింది. ఫీజుల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. గతంలో వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలల్లో అధిక ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలు తప్పుడు లెక్కలతో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వాసవి ఇంజనీరింగ్ కళాశాల పేరెంట్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గతంలో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది రాధాకృష్ణన్ .. వాసవి కాలేజీ రూ.4.53 కోట్లకు లెక్కలు చూపకుండా.. ఆ మొత్తాన్ని ఖర్చుగా చూపిందని ఆరోపించారు. అర్హతలేని వారిని అధ్యాపకులుగా నియమించిందని, బోధనేతర సిబ్బంది విషయంలోనూ చాలా మందికి కనీసార్హతలు లేవని పేర్కొన్నారు. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... ఫీజుల నిర్ణయించే అధికారం... నియంత్రణ కమిటీకే ఉంటుందని స్పష్టం చేసింది.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.