నగదు పంపిణీ పథకాలపై సుప్రీంకోర్టు విచారణ...కేంద్రం,ఈసీకి నోటీసులు

ఈ పిటిషన్‌ను అనుమతించిన సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

news18-telugu
Updated: July 2, 2019, 12:29 PM IST
నగదు పంపిణీ పథకాలపై సుప్రీంకోర్టు విచారణ...కేంద్రం,ఈసీకి నోటీసులు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 2, 2019, 12:29 PM IST
ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకం పై నిషేధం విధించాలని సుప్రీంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేశారని పిటిషనర్ వివరించారు. ఈ పిటిషన్‌ను అనుమతించిన సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఈ పథకాలను చట్టవిరుద్ధమైనవిగా, రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని విన్నవించింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకాలు లేకుండా మార్గదర్శకాలను రూపొందించాలని సూచించింది.

ఎన్నికలకు ముందు ప్రభుత్వ పథకాల పేరుతో నగదు పంపిణీ చేశారని ఆరోపిస్తూ జనసేన పార్టీ నేత పెంటపాటి పుల్లారావు గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, జార్ఖండ్‌, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలను ఎన్నికలకు కనీసం 6 నెలల ముందే ప్రకటించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

First published: July 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...