INX Media case: చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిల్

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సీబీఐ శుక్రవారం ఢిల్లీ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంతో పాటు మరో 13 మందిని సీబీఐ నిందితులుగా పేర్కొంది.

news18-telugu
Updated: October 22, 2019, 12:15 PM IST
INX Media case: చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిల్
చిదంబరం (File)
  • Share this:
కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి కాస్త ఊరట లభించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియాపై సీబీఐ నమోదు చేసిన కేసులో చిదంబరానికి సుప్రీం కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఇతర కేసుల్లో అరెస్టు కాని పక్షంలో మాత్రమే ఆయన్ని రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయవచ్చని కోర్టు తెలిపింది. అవసరమైనప్పుడల్లా విచారణకు హాజరుకావాలని  చిదంబరాన్ని ఆదేశించింది. అయితే ఇదే కేసు విషయంలో ప్రస్తుతం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ కస్టడీ అక్టోబర్‌ 24 వరకు కొనసాగనుంది.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సీబీఐ శుక్రవారం ఢిల్లీ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంతో పాటు మరో 13 మందిని సీబీఐ నిందితులుగా పేర్కొంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు విదేశీ నిధులు సమకూర్చడంలో చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఛార్జిషీట్‌లో సీబీఐ ఆరోపించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని అరెస్టు చేసి  దాదాపు ఎనిమిది వారాల పాటు  తిహార్‌ జైలులో ఉంచి సీబీఐ విచారించింది.

అయితే తాజాగా నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద చిదంబరాన్ని బుధవారం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకన్నారు. గురువారం దీనికి సంబంధించి ఆయన జ్యుడిషియల్‌ కస్టడీని ఢిల్లీ కోర్టు అక్టోబర్‌ 24 వరకు పొడిగించింది.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు