Home /News /politics /

SUPREME COURT GIVES SHOCK TO AP MINISTER ADIMULAPU SURESH AND ORDERS TO REGISTER CBI CASE FULL DETAILS HERE PRN

Shock to AP Minister: ఏపీ మంత్రికి సుప్రీం కోర్టు షాక్.. సీబీఐ దర్యాప్తుకు ఆదేశం... ఆయనపై ఉన్న ఆరోపణలు ఇవే..!

మంత్రి ఆదిమూలపు సురేష్ (ఫైల్)

మంత్రి ఆదిమూలపు సురేష్ (ఫైల్)

Supreme Court: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) కు సుప్రీం కోర్టు (Supreme Court) షాకిచ్చింది. ఆయనపై అక్రమాస్తుల కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (YSR Congress Party) మరోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై పలు కేసులున్నాయి. సాక్షాత్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అక్రమాస్తుల కేసులో విచారణ సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మరో మంత్రిని వివాదాలు చుట్టుముట్టాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి, మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) పై అక్రమాస్తుల కేసు నమోదు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మంత్రి సురేష్ తో పాటు ఆయన సతీమణి అయిన ఐఆర్ఎస్ అధికారిణి టీఎన్ విజయలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేయాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు నమోదు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టేసిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం FIR నమోదు  చేసి దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది.

    ప్రస్తుత ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన సతీమణి విజయ లక్ష్మి ఇద్దరూ ఐఆర్ఎస్ అధికారులు. ఉద్యోగాన్ని వదిలిపెట్టిన సురేష్.. రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం సీఎం జగన్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. 2016లో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉన్నారనే ఆరోపణలపై సీబీఐ 2016లో దేశవ్యాప్తంగా పలువురు ఐఆర్‌ఎస్‌ అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో విజయలక్ష్మిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసి, 2017లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇందులో ఏ-1గా విజయలక్ష్మి, ఏ-2గా ఆదిమూలపు సురేష్ ను పేర్కొన్నారు. 2010-16 మధ్య సురేష్ దంపతుల ఆదాయం రూ.4.84 కోట్లు ఉండాల్సి ఉండగా.. అంతకంటే అదనంగా 22 శాతం అంటే రూ.5.95 కోట్ల ఆస్తి ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసింది.

    ఇది చదవండి: చంద్రబాబు కుప్పం టూర్ వెనుక కారణం ఇదేనా..? తమ్ముళ్లు దారికొస్తారా..?



    అయితే ఈ ఎఫ్ఐఆర్ ను సురేష్ దంపతులు తప్పుబట్టారు. తమపై ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండానే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందంటూ గతంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన  ధర్మాసనం.. మంత్రి దంపతులకు అనుకూలంగా ఆదేశిలిచ్చింది. ప్రాథమిక విచారణ లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొంటూ సీబీఐ ఎఫ్ఐఆర్ ను తోసిపుచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.

    ఇది చదవండి: నగరిలో రోజాకు తప్పని తలనొప్పులు... సొంత నియోజకవర్గంలో మాట నెగ్గకపోతే ఎలా..?


    సుప్రీం కోర్టులో జరిగిన విచారణలో సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. అన్ని ఆధారాలతోనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఆ విషయాన్ని అఫిడవిట్ లో ఎందుకు పొందుపర్చలేదో చెప్పాలంది. మరోసారి ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. వాదనలు ముగిసిన అనంతరం మంత్రి సురేష్ దంపతులపై కేసు నమోదుకు సుప్రీం ఆదేశాలిచ్చింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap minister suresh, CBI, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు