Home /News /politics /

SUPREME COURT GIVES GREEN SIGNAL FOR PANCHAYAT ELECTIONS IN ANDHRA PRADESH HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్...

పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

ఉత్కంఠకు తెరపడింది. ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh government), ఎన్నికల కమిషన్ మధ్య జరిగిన యుద్ధంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimamgadda Ramesh Kumar) విజయం సాధించారు.

    ఉత్కంఠకు తెరపడింది. ఏపీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య జరిగిన యుద్ధంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు నిలిపేయాలంటూ ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసింది. పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేష్ రాయ్ నేతృత్వంలోని బెంచ్ ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో పాటు ఉద్యోగ సంఘాల వాదనలు అసలు వినిపించుకోనట్లు తెలుస్తోంది. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగాలన్న ధర్మాసనం.., వాయిదా వేయడానికి ఆస్కారమే లేదని స్పష్టం చేసింది.

    ప్రభుత్వంతో పాటు ఉద్యోగుల వాదనపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలతో ఉద్యోగ సంఘాలకు ఏం సంబంధమని కోర్టు ప్రశ్నించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయమూర్తి ముకుల్ రోహత్గీ వాదనలు వినపించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సినేషన్, ఎన్నికలను సమాంతరంగా నిర్వహించడం సాధ్యం కాదని వాదించారు. దీంతో జోక్యం చేసుకున్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.. రాజ్యాంగం ప్రకారమే ఎస్ఈసీ పనిచేస్తోందన్నారు. ఎన్నికల కమిషనర్ ను తప్పుబట్టం, ఆయన్ను నిందించడం సరికాదని అన్నట్లు తెలిసింది. రాజకీయ కారణాలతో ప్రతిసారీ ఎన్నికలు వాయిదా వేయడం సరికాదని పేర్కొంది.

    ఇక ఉద్యోగ సంఘాల తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాది యత్నించగా.., ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికలతో ఉద్యోగులకేం సంబంధం..? అసలు ప్రశ్నించడానికి మీరెవరు అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేరళలో ఎన్నికల వల్ల కరోనా కేసుసు పెరిగినట్లు న్యాయవాదులు వాదనలు వినిపించగా కోర్టు తోసిపుచ్చింది. ఉద్యోగ సంఘాల వాదనపై ధర్మాసనం ఒకింత అసహనం వ్యక్తం చేసింది. చివరికి ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకం కాదని.., తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని మాత్రమే కోరుతున్నట్లు ఉద్యోగ సంఘాల తరపు న్యాయవాది వివరణ ఇచ్చినట్లు సమాచారం. దీంతో హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ సుప్రీం తీర్పునిచ్చింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap cm ys jagan mohan reddy, Ap local body elections, Gram Panchayat Elections, Local body elections, Supreme Court

    తదుపరి వార్తలు