దేశరాజధాని ఢిల్లీలో పలు సంస్థల అధికార నియంత్రణాధికారం ఎవరిదనే అంశంపై.. కేంద్రప్రభుత్వానికి, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ ప్రభుత్వానికి నడుమ చాన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కీలకమైన శాఖకు సంబంధించి అధికార నియంత్రణపై ఆప్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం భారీ షాకిచ్చింది.
ఢిల్లీలో వివిధ ప్రభుత్వ సంస్థలపై అధికార నియంత్రణ ఎవరిదనే అంశంలో చాన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. చివరకు ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. అయితే, ఈ అంశంలో కీలకమైన అవినీతి నిరోధక శాఖపై అధికార నియంత్రణ ఎవరిదనేది స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఈ శాఖపై కేంద్రానిదే పూర్తిస్థాయి అధికారమని, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారమూ ఉండబోదని తీర్పునిచ్చింది. అవినీతి నిరోధక శాఖ , విచారణ కమిషన్ వంటివి కేంద్రప్రభుత్వం నియమించే లెఫ్టినెంట్ గవర్నర్ నియంత్రణలోనే పనిచేస్తాయని చెప్పింది.
ఢిల్లీలో అధికారాలపై కొంతకాలంగా ఆ రాష్ట్రప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా, అవినీతి నిరోధక శాఖ ఎవరి ఆదేశానుసారం పనిచేయాలి, కమిషన్ను ఎవరు ఏర్పాటు చేయాలనే అంశంలో సందిగ్ధత నెలకొంది. చివరకు ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరడంతో.. విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టి.. తాజాగా తీర్పును వెలువరించింది. అయితే, సర్వీసుల నియంత్రణపై అధికారం ఎవరిదన్న దానిపై న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. దీనిపై త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇక, ఎలక్ట్రిసిటీ కమిషన్, విద్యుత్ బోర్డులపై అధికారం ఢిల్లీ ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇతర న్యాయాధికారుల నియామకాన్ని కూడా ఢిల్లీ సర్కారే చేపడుతుందని తెలిపింది. వ్యవసాయ భూముల ధరలను కూడా సవరించుకోవచ్చని కేజ్రీవాల్ సర్కార్కు సూచించింది.
Published by:Santhosh Kumar Pyata
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.