హోమ్ /వార్తలు /రాజకీయం /

విగ్రహాల డబ్బులు కట్టాల్సిందే.. మాయావతికి సుప్రీంలో ఎదురుదెబ్బ

విగ్రహాల డబ్బులు కట్టాల్సిందే.. మాయావతికి సుప్రీంలో ఎదురుదెబ్బ

మాయావతికి సుప్రీం షాక్

మాయావతికి సుప్రీం షాక్

చిరకాల ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీతో చేతులు కలిపి.. పార్లమెంట్ ఎన్నికలకు దూసుకెళ్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బెహన్‌జీకి సుప్రీంకోర్టు ఊహించని షాక్‌నిచ్చింది.

  ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఏది చేసినా సంచలనమే. కోటానుకోట్లు ఖర్చు చేసి నివాస భవనాన్ని నిర్మించుకున్నా, తన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రత్యేక విమానంలో చెప్పులు తెప్పించుకున్నా.. ఆమెకు ఆమే సాటి. ఎన్ని విమర్శలు ఎదురైనా లెక్కచేయరు. అయితే, అప్పట్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఆమె చేసిన ఓ పనికి సుప్రీంకోర్టు తాజాగా పెద్ద ఝలక్ ఇచ్చింది. అప్పుడు వృథా చేసిన ప్రజాధనాన్ని ఇప్పుడు కట్టాల్సిందేనని స్పష్టం చేసింది.


  బీఎస్పీ అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా మాయావతి.. తన పార్టీ గుర్తు ఏనుగును.. రాష్ట్రవ్యాప్తంగా విగ్రహాల రూపంలో పలుచోట్ల ప్రతిష్టింపజేశారు. ఏనుగుల విగ్రహాలతో పాటు .. పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం విగ్రహాలనూ, తన విగ్రహాలనూ ఏర్పాటు చేయించారు. దీనిపై అప్పట్లో పెనుదుమారం రేగింది. కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోందంటూ.. ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైనా మాయావతి లెక్కచేయలేదు.అయితే, ఈ విగ్రహాల కోసం మాయావతి భారీగా ప్రజాధనాన్ని వృథా చేశారంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.


  ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. విగ్రహాల ఏర్పాటు కోసం మాయావతి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, భారీగా ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడింది. విగ్రహాల ఏర్పాటుకోసం ఖర్చయిన మొత్తాన్ని పైసాతో సహా చెల్లించాల్సిందేనని.. స్పష్టం చేసింది. ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్.. తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేశారు.


   

  First published:

  Tags: Mayawati, Sp-bsp, Supreme Court, Uttar pradesh

  ఉత్తమ కథలు