Supreme court Verdict on Rafael and Rahul Gandhi : ముందు నుంచి రక్షణ వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోదని చెబుతూ వస్తున్న సుప్రీం.. నేటి తీర్పులోనూ ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.
రాఫెల్ ఒప్పందంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. రాఫెల్‌పై కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. ముందు నుంచి రక్షణ వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోదని చెబుతూ వస్తున్న సుప్రీం.. నేటి తీర్పులోనూ ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. రాఫెల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని,ప్రధాని మోదీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని గతంలో దాఖలైన పిటిషన్లను డిసెంబర్ 14,2018లో కోర్టు కొట్టివేసింది. అయితే కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా,అరుణ్ శౌరి,న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సహా పలువురు దీనిపై రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. రివ్యూ పిటిషన్లను విచారించిన సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేత్రుత్వంలోని ధర్మాసనం గత మే 10న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు గురువారం తీర్పు వెల్లడించిన కోర్టు రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది.
ఇక రాహుల్‌పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో రాహుల్ చెప్పిన క్షమాపణలను ఆమోదించింది. రాఫెల్‌కు సుప్రీం క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా 'చౌకీదార్ చోర్ హై' అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కోర్టు మందలించింది. ఇకపై రాహుల్ జాగ్రత్తగా మాట్లాడాలని, భవిష్యత్‌లో సంయమనం పాటించాలని మందలించింది.రాహుల్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ అవసరం లేదని పేర్కొంది.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.